టీచర్​ను కిడ్నాప్​.. తలపై తుపాకీతో బెదిరించి కూతురితో పెళ్లి

Bihar Teacher Kidnapped, Forced To Marry Kidnapper Daughter - Sakshi

బిహార్​లో వింత పెళ్లి జరిగింది. ఓ టీచర్​ను కిడ్నాప్​ చేసి తలపై తుపాకీ పెట్టి బెదిరించి తన కుతురితో వివాహం జరిపించాడు కిడ్నాపర్​. బీహార్‌లోని వైశాలి జిల్లాలో ఈ ఉదాంతం వెలుగుచూసింది.  

వివరాలు.. గౌతమ్ కుమార్ ఇటీవలే బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి పటేపూర్‌లోని రేపురాలోని పాఠశాలలో టీచర్​గా విధులు నిర్వర్తిస్తునాడు. . బుధవారం అతను పాఠశాలలో ఉండగా.. ముగ్గురు నలుగురు వ్యక్తులు వచ్చి కిడ్నాప్​ చేశారు. 24 గంటల్లోనే తుపాకీతో బెదిరించి కిడ్నాపర్లలో ఒకరి కుమార్తెతో బలవంతంగా   వివాహం చేశారు. వివాహానికి నిరాకరించింనందుకు బాధితుడిపై దాడి కూడా చేశారు. 

సమాచారం అందుకున్న పోలీసులు తప్పిపోయిన ఉపాధ్యాయుడిని గాలించే పనిలో పడ్డారు.  గౌతమ్​ కుమార్​ కుటుంబ సభ్యులు రాజేష్ రాయ్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు.  తమ కుమారుడిని బలవంతంగా తీసుకెళ్లి రాయ్ కుమార్తె చాందినితో వివాహం చేసి ఉంటారని ఆరోపించారు. కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

కాగా బిహార్​లో పకడ్వా వివాహం(ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవడం) ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. గతేడాది అనారోగ్యానికి గురైన జంతువుకు వైద్యం చేసేందుకు వచ్చిన పశువైద్యుడిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి బెగుసరాయ్‌లో బలవంతంగా వివాహం జరిపించారు. కొన్నేళ్ల క్రితం బీహార్‌లో ఓ ఇంజనీర్‌కు సంబంధించిన ఇలాంటి ఘటనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బొకారో స్టీల్ ప్లాంట్‌లో జూనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్న 29 ఏళ్ల వినోద్ కుమార్ పాట్నాలోని పండరక్ ప్రాంతంలో ఓ మహిళను కొట్టి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top