పోస్ట్‌ మార్టం చేస్తుండగా.. భయానక సంఘటన

Bengaluru Man Declared Brain Dead Gets Goosebumps During Postmortem - Sakshi

పోస్ట్‌మార్టం చేస్తుండగా.. కదలిక

బెంగళూరులో చోటు చేసుకున్న ఘటన

బెంగళూరు: చనిపోయాడని.. నిర్ధారించి పోస్ట్‌ మార్టం చేస్తుండగా.. సడెన్‌గా ఆ వ్యక్తిలో చలనం వస్తే.. అక్కడున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. దారుణం కదా.. పిరికి వాళ్లు అయితే హార్ట్‌ ఎటాక్‌తో పోయినా పోతారు. ఇలాంటి సంఘటనే ఒకటి బెంగళూరులో చోటు చేసుకుంది. బ్రెయిన్‌ డెడ్‌ అని నిర్ధారించిన ఓ వ్యక్తికి పోస్ట్‌ మార్టం చేస్తుండగా.. సడెన్‌గా అతడిలో కదలిక వచ్చింది. దాంతో మొదట షాక్‌ అయిన వైద్యులు.. ఆ తర్వాత తేరుకుని చెక్‌ చేసి.. అతడిని ఆస్పత్రికి తరలించి చికత్స కొనసాగిస్తున్నారు. 

ఆ విరాలు.. శంకర్‌ గోంబి అనే వ్యక్తి గత నెల 27న మహాలింగాపూర్‌ ప్రాంతంలో ప్రమాదానికి గురయ్యాడు. ఈ క్రమంలో అతడిని బెలగావి ఆస్పత్రిలో చేర్చారు. రెండు రోజుల పాటు ఆబ్జర్వేషన్‌లో ఉంచిన వైద్యులు అతడిని బ్రెయిన్‌ డెడ్‌ అని ప్రకటించారు. ఈ క్రమంలో పోస్ట్‌మార్టం నిమిత్తం శంకర్‌ గోంబిని మహాలింగాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఎస్‌ఎస్‌ గల్‌గాలి అనే వైద్యుడి అధ్వర్యంలోని బృందం శంకర్‌కి పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు రెడి అయ్యింది. ఇక శంకర్‌ కుటుంబం అతడికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వైద్యుల బృందం శంకర్‌కి పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు గాను అతడి శరీరాన్ని తాకగానే.. వెంటనే అతడిలో కదలికి వచ్చింది. శంకర్‌ రోమాలు నిక్కబొడుచుకున్నాయి. 

దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయపడ్డారు. ఆ తర్వాత శంకర్‌ని మరోసారి పరీక్షించగా.. అతడు బతికే ఉన్నట్లు తెలిసిందే. వెంటనే దీని గురించి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు చేరుకుని శంకర్‌ని వేరే ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా గల్‌గాలి మాట్లాడుతూ.. నా 18 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 400 పోస్ట్‌మార్టమ్‌లు చేసి ఉంటాను. కానీ ఇలాంటి కేసును ఇంతవరకు చూడలేదు. భయంతో గుండె ఆగినంత పని అ‍య్యింది అన్నారు. 

చదవండి:
ఏనుగు పోస్టుమార్టం రిపోర్టు: షాకింగ్‌ నిజాలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top