#Bengaluru Air Port Veer Arjun: ట్రెండింగ్‌లో నాలుగేళ్ల చిన్నారి.. ఏం చేశాడంటే

At Bengaluru Airport 4 Year Old Boy Salutes CISF Personnel - Sakshi

వైరలవుతోన్న వీర్‌ సెల్యూట్‌ వీడియో

చిన్నారిపై ప్రశంసల జల్లు

కర్ణాటక: ఉదయం లేచిన దగ్గర నుంచి మన పనులన్నింటిని సవ్యంగా పూర్తి చేసుకుని.. రాత్రి  ఇంటికి చేరుకుని.. ఏ భయం లేకుండా గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్ర పోతున్నామంటే అందుకు ప్రధాన కారణం భద్రతా సిబ్బంది. వారు కుటుంబాలకు దూరంగా, నిద్రాహారాలు మాని.. మన కోసం పని చేస్తున్నారు కాబట్టే.. మనం సురక్షితంగా ఉండగల్గుతున్నాం. అలాంటి వారి పట్ల మనం గౌరవమర్యాదలు కలిగి ఉండటం వారికిచ్చే అసలైన ప్రశంస.

ప్రస్తుతం ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్‌​ మీడియాలో తెగ వైరలవుతోంది. నాలుగేళ్ల కుర్రాడు.. రక్షణ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని చూసి.. వారికి సెల్యూట్‌ చేస్తాడు. ప్రతిగా వారు చిన్నారికి అభివాదం చేస్తారు. ఈ వీడియో చూసిన నెటిజనులు చిన్నారి దేశభక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు..
(చదవండి: చావైనా..బతుకైనా.. అమ్మతోనే అన్నీ)

ఈ సంఘటన కర్ణాటక, బెంగళూరు విమానాశ్రయంలో చోటు చేసుకుంది. దీనిలో నాలుగెళ్ల చిన్నారి వీర్‌ అర్జున్‌ తండ్రి చేయి పట్టుకుని నడుచుకుంటూ విమానాశ్రయం లోపలకి వెళ్తుంటాడు. ఆ సమయంలో వీర్‌కు ఎదురుగా సెంట్రల్‌ ఇండస్ట్రీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌) జవాన్లు తన విధులకు హాజరయ్యేందుకు వాహనంలో వస్తుంటారు. వారిని గమనించిన వీర్‌.. తండ్రి చేయి వదిలిపెట్టి.. సీఐఎస్‌ఎఫ్‌ వాహనానికి ఎదురుగా నిలబడి.. వారికి సెల్యూట్‌ చేస్తాడు.

వీర్‌ని గమనించిన సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ప్రతిగా సెల్యూట్‌ చేస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియోని వీర్‌ తండ్రి తొలుత ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఇది చూసిన నెటిజనులు వీర్‌పై ప్రశంసలు కురిపించసాగారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఈ వీడియోని రీ పోస్ట్‌ చేస్తూ.. ‘‘గౌరవం, దేశభక్తి వంటి అంశాలను బాల్యంలోనే నేర్పించాలి’’ అంటూ వీర్‌పై ప్రశంసలు కురిపించడంతో ఇది మరోసారి వైరలయ్యింది. ఇప్పటికే ఈ వీడియో ని 4 లక్షల మందికిపైగా లైక్‌ చేశారు. 
(చదవండి: డ్రైవర్‌ నిర్లక్ష్యంతో.. సంధ్య వాలింది)

ఈ వీడియో చూసిన నెటిజనులు.. ‘‘ఈ చిన్నారి దేశభక్తిని చూసి ఫిదా అయ్యాను. చిన్నారిని అతడి తల్లిదండ్రులు సరైన మార్గంలో పెంచుతున్నారు.. ఇలాంటి మంచి లక్షణాలను బాల్యం నుంచే అలవాటు చేస్తున్నారు. బాలుడికి సెల్యూట్‌ చేసిన సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి అభినందనలు’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 

చదవండి: ‘ఏడవకురా.. ఏప్రిల్‌లో వెళ్లిపోతాం లే’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top