భార్య మృతి.. ఐసీయూలో ఐపీఎస్‌ భర్త ఆత్మహత్య | Assam Home Secretary Shiladitya Chetia Shoots Himself | Sakshi
Sakshi News home page

భార్య మృతి.. ఐసీయూలో ఐపీఎస్‌ భర్త ఆత్మహత్య

Published Wed, Jun 19 2024 10:27 AM | Last Updated on Wed, Jun 19 2024 10:35 AM

Assam Home Secretary Shiladitya Chetia Shoots Himself

భార్యాభర్తల బంధం విడదీయరానిదని అంటుంటారు. పెళ్లితో ముడిపడిన జంట తాము జీవితాంతం కలిసుంటామని ప్రమాణం చేస్తారు. ఎన్ని కష్టనష్టాలొచ్చినా కలిసి నడుస్తారు. పరస్పరం ప్రాణప్రదంగా ప్రేమించుకున్న దంపతుల్లో విధివశాత్తూ ఒకరు మరణిస్తే, మరొకరు ఆ ఎడబాటును తట్టుకోలేక విలవిలలాడిపోతుంటారు.

అసోం హోమ్‌శాఖ సెక్రటరీ శిలాదిత్య చెతియా(44) తన భార్య మరణంతో తీవ్రంగా కలతచెంది, ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వార్త అసోంలోని అందరినీ షాక్‌నకు గురిచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గౌహతిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని  ఐసీయూలో తన భార్య మృతదేహం ముందు శిలాదిత్య చెతియా తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భార్య మృతిచెందిన కొద్ది నిమిషాలకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అతని భార్య కొంతకాలంగా అదే ఆసుపత్రిలో క్యాన్సర్‌కు చికిత్సపొందుతున్నారు.  

శిలాదిత్య చెతియా రాష్ట్రపతి శౌర్య పతకాన్ని అందుకున్న ఐపీఎస్ అధికారి. రాష్ట్ర హోమ్‌శాఖ సెక్రటరీగా బాధ్యతలు చేప్టటడానికి ముందు ఆయన టిన్సుకియా, సోనిత్‌పూర్ జిల్లాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌పీ)గా, అసోం పోలీసు నాల్గవ బెటాలియన్‌కు కమాండెంట్‌గా పనిచేశారు. ఆయన భార్య అగమోని బోర్బరువా(40) నామ్‌కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఈ ఘటన గురించి నామ్‌కేర్ మేనేజింగ్ డైరెక్టర్ హితేష్ బారువా మాట్లాడుతూ ‘బుల్లెట్ శబ్దం వినగానే మేమంతా పరిగెత్తుకుంటూ ఐసీయూలోని వెళ్లాం. అక్కడ శిలాదిత్య చెతియా తన భార్య మృతదేహం పక్కనే రక్తపు మడుగులో పడివున్నారు. మేము అతని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని’ అన్నారు. కాగా చెతియా మృతిపై అసోం డీజీపీ జీపీ సింగ్ విచారం వ్యక్తం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement