అమృత్‌ సహాయకుడి అరెస్ట్‌ | Amritpal Singh top aide arrested from Punjab | Sakshi
Sakshi News home page

అమృత్‌ సహాయకుడి అరెస్ట్‌

Apr 16 2023 6:04 AM | Updated on Apr 16 2023 6:04 AM

Amritpal Singh top aide arrested from Punjab - Sakshi

చండీగఢ్‌: ఖలిస్తానీ అనుకూల బోధకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ ముఖ్య సహాయకుడు మరొకరు పోలీసులకు చిక్కాడు. లూధియానాకు చెందిన జోగిసింగ్‌ ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో డేరా నిర్వహిస్తున్నాడు.

మార్చి 18 నుంచి పరారీలో ఉన్న అమృత్‌పాల్‌కు పిలిభిత్‌లో ఆశ్రయం ఇవ్వడంతోపాటు పంజాబ్‌ తిరిగి వచ్చేందుకు వాహనాలను సమకూర్చినట్లు పోలీసులు చెప్పారు. అతడిని సిర్‌హింద్‌లో అరెస్ట్‌ చేసినట్లు శనివారం పోలీసులు చెప్పారు. ఇతడితోపాటు అమృత్‌పాల్‌కు సహకరించిన హోషియార్‌పూర్‌ వాసి రాజ్‌దీప్‌సింగ్, జలంధర్‌కు చెందిన సరబ్‌జీత్‌ సింగ్‌లను కూడా అదుపులోకి
తీసుకున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement