అత్తింట్లో చిత్రహింసలు: మేళతాళాలతో కుమార్తెకు తండ్రి ఘన స్వాగతం

Amazing Prem Gupta of Ranchi brought his married daughter with a band - Sakshi

మేళ తాళాలతో  ఘనంగా పెళ్లిచేసి కూతురిని బ్యాండ్-బాజా-బారాత్‌తో సాగనంపడం మన అందరమూ  చూసి ఉంటాం కానీ పెళ్లయిన కూతురిని అదే ఆనందంతో శాశ్వతంగా ఇంటికి తిరిగి తీసుకురావడం మీరు ఎప్పుడైనా చూశారా? అవును ఇది నిజంగా జరిగింది. అరుదైన ఈ ఘటన ఝార్ఖండ్‌‌ రాజధాని రాంచీలో చోటుచేసుకుంది.   

మూడు ముళ్లూ పడిన తరువాత చచ్చిన బతికినా మెట్టినింట్లోనే మన సమాజంలో  ఎక్కువ మంది ఆడ పిల్లలని వేధించే మాటలివి. ఏ కష్టం వచ్చినా.. కాంప్రమైజ్  అయ్యి బతకాల్సిందే. తరాలు మారుతున్నా అమ్మాయిల జీవితాల్ని శాసిస్తున్న  ఇలాంటి కట్టుబాట్లను తోసి రాజన్నారొక తండ్రి. తండ్రి అంటే ఇలానే ఉండాలి అన్నట్టుగా  ప్రవర్తించి ఈ ప్రపంచంలోని అమ్మాయిలందరి మనసు దోచుకున్నారు.  

రాంచీకి చెందిన ప్రేమ్‌ గుప్తా తన కుమార్తె సాక్షి గుప్తాకు గతేడాది ఏప్రిల్‌లో సచిన్‌ కుమార్‌ అనే వ్యక్తితో ఘనంగా పెళ్లి జరిపించారు. భర్తతో నిండు నూరేళ్లు హాయిగా జీవించమంటూ ఆశీర్వదించి అత్తారింటి సాగనంపారు. అయితే వేయి కలలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆమె ఆశలన్నీ ఆవిరైపోయాయి. భర్తకు ఇంతకుముందే పెళ్లి  అయింది. ఒకసారి కాదు, రెండుసార్లు పెళ్లి చేసుకున్నాడు. మూడో పెళ్లి తర్వాత కూడా సాక్షితో కలిసి సవ్యంగా జీవించలేదు. అయినా సర్దుకు పోదాం అనుకుంది. అతడే మార తాడులే అనుకుని బంధం కొనసాగించాలని సాక్షి నిర్ణయించుకుంది. దీనికి తోడు అత్తింటి వేధింపులు కూడా ఎక్కువ కావడంతో, తల్లిదండ్రులతో తన గోడును వెళ్ల బోసుకుంది. కూతురి కష్టాలు  చూసిన తండ్రి చలించిపోయాడు.

సాక్షికి అండగాఉండాలనే నిర్ణయం తీసుకోవడంమాత్రమేకాదు. భాజాభజంత్రీలు, బాణాసంచాతో ఊరేగింపుగా తన కుమార్తెను తిరిగి పుట్టింటికి స్వాగతం పలికారు తండ్రి. దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలోషేర్ చేశారు. ఆడపిల్లలు చాలా విలువైన వాళ్లు.. వాళ్లను గౌరవించాలి..అంటూ సమాజానికి మంచి సందేశ మిచ్చారు. దీంతో నెటిజన్లు  ఆయనను అభినందిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top