దేశంలో ఎగిరే టాక్సీలకి తొలిగిన అడ్డంకి

Air Taxis Very Possible Under New Drone Policy: Jyotiraditya Scindia - Sakshi

మన దేశంలో రాబోయే కాలంలో నగర రోడ్లపై ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించే ఎయిర్ టాక్సీ సేవలు ప్రారంభం కావచ్చు. దేశంలో డ్రోన్‌(Drone) కార్యకలాపాల నిర్వహణను సులభతరం చేస్తూ నూతన 2021 డ్రోన్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మానవరహిత విమాన వ్యవస్థ నిబంధనల స్థానంలో డ్రోన్‌ నిబంధనలు-2021(Drone Rules) పేరిట వీటిని విడుదల చేసింది. "ఎయిర్ టాక్సీలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోదనలు జరుగుతున్నాయి.. దీనికోసం అనేకా స్టార్టప్ లు ముందుకు వస్తున్నాయి. మీరు రోడ్లపై చూసే ఉబెర్ టాక్సీల వలే, కొత్త డ్రోన్ పాలసీ కింద మీరు గాలిలో ఎగిరే టాక్సీలను చూసే సమయం చాలా దూరంలో లేదు. త్వరలోనే ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నా' అని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. 

ఈ నిబంధనల ప్రకారం.. డ్రోన్ల ఆపరేషన్ కోసం లైసెన్స్ నమోదు లేదా జారీ చేయడానికి ముందు ఎలాంటి సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరం లేదు. అంతేగాకుండా, ఈ లైసెన్స్ ఫీజులను గణనీయంగా తగ్గించారు. కార్గో డెలివరీల కోసం డ్రోన్ కారిడార్లు అభివృద్ధి చేయనున్నారు. డ్రోన్లు గరిష్ఠంగా మోసుకెళ్లే సామర్ధ్యాన్ని 300 కిలోల నుంచి 500 కిలోలకు పెంచారు. డ్రోన్లను ఆపరేట్ చేయడానికి నింపాల్సిన ఫారాలను 25 నుంచి 5కు తగ్గించింది. ఆపరేటర్ నుంచి వసూలు చేసే ఫీజుల రకాలను 72 నుంచి నాలుగుకు తగ్గించింది. ఇక అన్ని డ్రోన్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ డిజిటల్ స్కై ఫ్లాట్ ఫారం ద్వారా జరుగుతాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) సిఫారసు చేసే నిబంధనలకు అనుగుణంగా అన్ని డ్రోన్ ట్రైనింగ్, పరీక్షలు నిర్వహించబడతాయి.(చదవండి: అసంఘటిత కార్మికులకు కేంద్రం శుభవార్త!)

జర్మన్ ఫ్లయింగ్ టాక్సీ స్టార్టప్ వోలోకాప్టర్ 2024 పారిస్ లో జరిగే ఒలింపిక్స్ సమయానికి తన ఎయిర్ టాక్సీని అందుబాటులోకి తీసుకొనిరావలని చూస్తుంది. భారీ డ్రోన్ లాగా కనిపించే ఈ ఎగిరే టాక్సీ రెండు సీట్లను కలిగి ఉంటుంది. ప్రధాన ఆటోమోటివ్ తయారీదారులు కూడా ఈ రంగంలో ఆసక్తిని కనబరుస్తున్నారు సింధియా అన్నారు. హ్యుందాయ్ 2025 నాటికి తన ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఈ దక్షిణ కొరియా కంపెనీ ఎయిర్ టాక్సీలను అభివృద్ధి చేస్తోంది. ఇది ఎలక్ట్రిక్ బ్యాటరీల పనిచేస్తుంది. ఇది అత్యంత రద్దీగా ఉండే పట్టణ కేంద్రాల నుంచి విమానాశ్రయాలకు ఐదు నుంచి ఆరు మందిని రవాణా చేయగలదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top