Govt Launches E-Shram Portal For Unorganised Sector Employees - Sakshi
Sakshi News home page

e-Shram: అసంఘటిత కార్మికులకు కేంద్రం శుభవార్త!

Aug 26 2021 7:09 PM | Updated on Aug 26 2021 8:00 PM

Govt launches e-Shram portal for unorganised sector workers - Sakshi

దేశ వ్యాప్తంగా అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల సంక్షేమం కోసం కార్మిక, ఉపాధిశాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ నేడు లాంఛనంగా ఈ-శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా దేశంలోని అసంఘటిత రంగంలోని కార్మికుల వివరాలను సేకరిస్తారు. అలాగే వారి సంక్షేమం కోసం వివిధ సామాజిక భద్రతా పథకాలను మరింత మెరుగ్గా అమలు చేయడానికి ఉపకరిస్తుంది. ఆధార్‌కార్డు ఆధారంగా కార్మికులు తమ వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల ఆయా కేటగిరిల కింద ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కార్మికులకు అందించే వీలు కలగనుంది. 

ప్రమాధ భీమా రూ.2 లక్షలు
"భారతదేశ చరిత్రలో మొట్ట మొదటిసారిగా 38 కోట్ల మంది అసంఘటిత కార్మికుల వివరాలను నమోదు చేయడానికి ఒక వ్యవస్థ తయారు చేయబడుతోంది. దీనిలో వివరాలు నమోదు చేయడం ద్వారా కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సామాజిక భద్రతా పథకాలను పొందడానికి సహాయంగా ఉంటుంది" అని కార్మిక మంత్రి అన్నారు. అలాగే, ఇందులో తమ పేర్లు నమోదు చేసుకున్న అసంఘటిత కార్మికులకు రూ.2.0 లక్షల యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ అందించినందుకు ప్రధాన మంత్రికి శ్రీ భూపేందర్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ఒక వ్యక్తి ప్రమాదానికి లోనై మరణిస్తే/శాశ్వత వైకల్యం చెందితే రూ.2.0 లక్షలు, పాక్షిక వైకల్యం చెందితే రూ.1.0 లక్షలకు అందించనున్నట్లు తెలిపారు. కార్మికుల సంక్షేమం కొరకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది అని అన్నారు.(చదవండి: పతకం చేజార్చుకున్న 24 మంది ఒలింపియన్లకు టాటా కార్లు)

అసంఘటిత రంగ కార్మికులు నేటి నుంచే తమ పేర్లను ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు. పుట్టిన తేదీ, స్వస్థలం, మొబైల్ నంబర్ వంటి ఇతర అవసరమైన వివరాలను నింపాల్సి ఉంటుంది. అలాగే, కార్మికుడు తన ఆధార్ కార్డ్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలను ఉపయోగించి నమోదు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు నమోదు చేశాక కార్మికునికి ఈ-శ్రమ్ కార్డు ఒకటి మీకు వస్తుంది. దాన్ని భద్రపర్చుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏవైనా సందేహాలుంటే.. నివృత్తి చేసుకునేందుకు జాతీయ స్థాయిలో టోల్ ఫ్రీ నంబర్ 14434ని కూడా ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement