ఈపీఎఫ్‌వోలోకి 18.36 లక్షల కొత్త సభ్యులు

EPFO: Over a million new EPF members were added in June - Sakshi

జూన్‌ నెలలో నమోదు

వార్షికంగా, నెలవారీగా వృద్ధి

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్వహించే సామాజిక భద్రతా పథకంలోకి జూన్‌ నెలలో కొత్తగా 18.36 లక్షల మంది సభ్యులు చేరారు. అంతక్రితం ఏడాది జూన్‌ నెలలో కొత్త సభ్యులు 12.83 లక్షలతో పోలిస్తే మంచి వృద్ధి నమోదైంది. ఇందుకు సంబంధించి పేరోల్‌ గణాంకాలను కార్మిక శాఖ విడుదల చేసింది. ఈ ఏడాది మేనెలలో కొత్త సభ్యుల చేరికతో పోల్చి చూసినా జూన్‌లో 9.21 శాతం వృద్ధి కనిపిస్తోంది. (వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్‌)

ఇక జూన్‌లో నికర కొత్త సభ్యులు 18.36 లక్షల మందిలో 10.54 లక్షల మంది ఈపీఎఫ్‌ అండ్‌ ఎంపీ యాక్ట్, 1952 కింద మొదటసారి చేరిన వారు కావడం గమనించాలి. 7.82 లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరడం వల్ల కొత్త సభ్యుల్లో భాగంగా ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచీ ప్రతి నెలా కొత్త సభ్యుల్లో వృద్ధి కనిపిస్తోంది. 22–25 వయసు నుంచి 4.72 లక్షల మంది కొత్తగా చేరిన వారున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల నుంచే 12.61 లక్షల మంది కొత్తగా చేరారు. మొత్తం కొత్త సభ్యుల్లో మహిళలు 4.06 లక్షల మంది ఉన్నారు. ఈపీఎఫ్‌వో మొత్తం సభ్యుల్లో మహిళల శాతం మే చివరికి 20.37 శాతంగా ఉంటే, జూన్‌ చివరికి 22.09 శాతానికి తగ్గింది. (Electric Scooters: కేవలం వేలం వెర్రేనా? సర్వేలో షాకింగ్‌ విషయాలు)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top