ఢిల్లీ: భారత వాయుసేన (IAF) తదుపరి చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు. కేంద్రప్రభుత్వం ఆయనను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా సేవలందిస్తున్న ఆయన, ఈ నెల అక్టోబర్ 31న చీఫ్ ఆఫ్‌ది ఎయిర్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్‌కు PVSM, AVSM, VM, VSM వంటి ప్రతిష్ఠాత్మక సైనిక పురస్కారాలు అందుకున్నారు. ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (DSSC), నేషనల్ డిఫెన్స్ కాలేజ్ (NDC)లో ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు.
అశుతోష్ దీక్షిత్ వాయుసేనలో ఆయన అనేక కీలకమైన ఆపరేషనల్, వ్యూహాత్మక బాధ్యతలను నిర్వహించారు. హెడ్‌క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్‌లో చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (CISC)గా పనిచేశారు. అనంతరం ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్, సెంట్రల్ ఎయిర్ కమాండ్ విధులను నిర్వర్తించారు.
తన సుదీర్ఘ వాయుసేన కెరీర్‌లో ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ కీలకమైన సైనిక ఆపరేషన్లలోనూ పాల్గొన్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సఫేద్ సాగర్, ఆపరేషన్ రక్షక్లో ఆయన పాలుపంచుకున్నారు. ఫైటర్ పైలట్‌గా, టెస్ట్ పైలట్‌గా, శిక్షకుడిగా, ఫ్రంట్‌లైన్ ఫైటర్ బేస్ కమాండర్‌గా, అలాగే ఉన్నతస్థాయి వ్యూహాత్మక,ఆపరేషనల్ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు భారత వాయుసేన అత్యున్నత పదవిని చేపట్టనున్నారు.
ఇదీ చదవండి: హర్ముజ్‌లో తీవ్ర ఉద్రిక్తత


