నేడు కాంగ్రెస్‌ కీలక భేటీ  | AICC To Hold Emergency Meeting On Present Politics | Sakshi
Sakshi News home page

నేడు కాంగ్రెస్‌ కీలక భేటీ 

Jun 11 2026 4:54 AM | Updated on Jun 11 2026 6:25 AM

AICC To Hold Emergency Meeting On Present Politics

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ గురువారం కీలక అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయం ‘ఇందిరా భవన్‌’లో కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే సారథ్యంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లు, పీసీసీ అధ్యక్షులు హాజరవుతారని జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు. మోదీ ప్రభుత్వం సాధించిన ప్రగతి కంటే ప్రజలకు జరిగిన నష్టమే ఎక్కువని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌ ఆ అంశాలను చార్జ్‌ షీట్‌ రూపంలో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. యువత ఉపాధి అవకాశాలను కోల్పోవడం, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో జాప్యంపై దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చే అవకాశం ఉంది. మీనాక్షి నామినేషన్‌ తిరస్కరణ అంశం సైతం గురువారం నాటి సమావేవంలో చర్చకురానుంది.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement