breaking news
high-level meeting
-
నేడు భారత్, అమెరికా వాణిజ్యచర్చలు
వాషింగ్టన్: భారత్‌పై అమెరికా 50 శాతం టారిఫ్‌ల భారం మోపడంతో వాటిని తగ్గించుకునేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరంచేసింది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో అమెరికా అత్యున్నతస్థాయి ప్రతినిధి బృందంతో వాణిజ్య చర్చలు జరపనుంది. ఈ వివరాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వాణిజ్య సలహాదారు పీటర్ నవరో సోమవారం వెల్లడించారు. భారతీయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను భారీగా పెంచడంతో అమెరికాకు భారతీయ సరకుల ఎగుమతులు ఆగస్ట్‌లో తొమ్మిది నెలల కనిష్టానికి పడిపోయిన తరుణంలో ఈ కీలక వాణిజ్య చర్చలు మొదలుకానుండటం గమనార్హం. భారత్, అమెరికా వాణిజ్యచర్చల అంశాన్ని సీఎన్‌బీసీ ఇంటర్వ్యూలో నవరో వెల్లడించారు. భేటీ కచి్చతంగా జరగనుందని భారత్ తరఫున చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న దేశ వాణిజ్యమంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ సైతం చెప్పారు. అమెరికా మధ్య, దక్షిణాసియా వ్యవహారాల వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ సైతం ఈ చర్చల్లో పాల్గొననున్నారు. ‘‘ భారత్ ఎప్పటికైనా అమెరికాతో వాణిజ్య చర్చలపై తుది నిర్ణయం తీసుకోక తప్పదు. లేదంటే వాణిజ్యం అనేది సవ్యంగా సాగదు. టారిఫ్‌ల విషయంలో భారత్ మహారాజు వంటిదే. మా సరకులపై అత్యధిక సుంకాలు మోపుతుంది. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు వరకు రష్యా నుంచి భారత్ కొనుగోలుచేసిన ముడి చమురు పరిమాణం చాలా అత్యల్పం. కొన్ని చుక్కల ఆయిల్ మాత్రమే కొన్నదేమో. ఇప్పుడేమో భారీఎత్తున కొనగోలుచేస్తూ భారత్ లాభాలను కొల్లగొడుతోంది. రష్యా ఆయిల్ రిఫైనరీ సంస్థలు సైతం భారత్‌కు చమురు అమ్మేసి లాభాల పంట పండిస్తున్నారు. ఈ లాభాలతో ఉక్రెయిన్ యుద్ధాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఉక్రెయిన్‌కు సాయపడేందుకు అమెరికా పెద్ద ఎత్తున సొంత ఖజానా కరెన్సీని ఖర్చుచేస్తోంది. అలా అమెరికన్లు పన్నుల రూపంలో అమెరికా ప్రభుత్వానికి చెల్లించిన మొత్తాలన్నీ ఉక్రెయిన్ యుద్ధం కోసం వృథా అవుతున్నాయి’’ అని భారత్‌ను పరోక్షంగా నవరో విమర్శించారు. -
ఉత్తర్‌ప్రదేశ్‌లో సీఎం యోగి సర్కార్ కొత్త రూల్స్
లక్నో: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ రాష్ట్రంలో కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చారు. యూపీ సర్కార్ కొత్త నిబంధనల మేరకు.. విధి నిర్వహణలో చెఫ్‌లు, వెయిటర్లు మాస్క్‌లు, గ్లౌజులు ధరించాలి. హోటళ్లు, రెస్టారెంట్లలో సీసీ టీవీ కెమెరాలు తప్పని సరిగా ఇన్ స్టాల్ చేయాలి. నిర్వాహకులు, మెనూ బోర్డ్‌లపై నిర్వాహకుల పేర్లు, అడ్రస్ వివరాలు తప్పని సరిగా ఉండాలని సీఎం యోగి ఆధిత్యనాథ్ స్పష్టం చేశారు. ఫ్రూట్‌జ్యూస్‌లో మూత్రంకొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో ఖుషీ జ్యూస్ కార్నర్ షాపు యజమాని పండ్ల రసాల్లో మూత్రం కలిపి అమ్ముతూ పట్టుబడ్డాడు. జ్యూస్‌లో మూత్రం కలుపుతుండగా..అక్కడే ఉన్న వినియోగదారుడు నిలదీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.Uttar Pradesh : In Loni of Ghaziabad, locals caught Mohd. Aamir and Md Kaif mixing Human URINE in juice at their juice shop and selling it to people. Police even recovered a plastic can filled with Urine at the shop named Khushi Juice Corner. Case has been registered and both… pic.twitter.com/jkC8poGuVn— Amitabh Chaudhary (@MithilaWaala) September 14, 2024 రాష్ట్రంలో కొత్త నిబంధనలుఈ నేపథ్యంలో సీఎం యోగి ఆధిత్యనాథ్ ఆద్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోటల్స్‌లో కొత్త నిబంధనల్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు.సమావేశం అనంతరం ఆధిత్యనాథ్ మాట్లాడుతూ.. తినే ఆహార పదార్థాలు కల్తీ అవుతున్న ఘటనల నేపథ్యంలో ఆహార పదార్థాలలో మానవ వ్యర్థాలను కలపడం అసహ్యకరమైంది. ఆమోదయోగ్యం కాదు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతంగా కాకుండా ఉండేందుకు కొత్త నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కొత్త నిబంధనల్ని అమలు చేస్తున్నారా? లేదా అని పరిశీలించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, పోలీసులు, స్థానిక అధికారులు తనిఖీ చేస్తారని అన్నారు.ప్రజారోగ్యం విషయంలో రాజీ పడేది లేదని తెలిపారు. ఆహారం కలుషితం లేదా అపరిశుభ్రమైన పద్ధతుల్ని అవలంభించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. చదవండి : రేసుగుర్రం నటుడు రవి కిషన్‌పై సీఎం యోగి ఆసక్తికర వ్యాఖ్యలు -
వెనెజులాను ఆక్రమిస్తే పోలా?
బొగోటా: ‘ప్రాంతీయ భద్రతకు సవాల్‌గా మారిన వెనెజులాను ఆక్రమించేస్తే సమస్య పరిష్కారమవుతుంది కదా?’ ఉన్నతస్థాయి సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్న మాటలివి. గత ఆగస్టులో వెనెజులాపై ఆంక్షల గురించి చర్చించిన సందర్భంగా ట్రంప్ వేసిన ఈ ప్రశ్నకు విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్, జాతీయ భద్రత సలహాదారు మెక్ మాస్టర్ తదితరులు అవాక్కయ్యారని పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఓ ఉన్నతాధికారి తాజాగా వెల్లడించారు. చర్చ సందర్భంగా మెక్‌మస్టర్ తదితరులు వెనెజులాపై సైనిక చర్యతో కలిగే పరిణామాలను ట్రంప్‌నకు వివరించారు. అధ్యక్షుడు నికొలస్ మదురోను గద్దెదించే లక్ష్యంతో చేపట్టే ఈ చర్య ఫలితంగా లాటిన్ అమెరికా దేశాధినేతల మద్దతు కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించారు. అయినప్పటికీ ట్రంప్ వెనక్కు తగ్గలేదు. సైనిక చర్యకు ఆదేశాలు ఇచ్చే విషయమై ఆయన ఎలాంటి వ్యాఖ్య చేయనప్పటికీ.. గతంలో పనామా (1989), గ్రెనడా(1982)లపై విజయవంతంగా చేపట్టిన సైనిక చర్యలను ప్రస్తావించారని ఆ అధికారి తెలిపారు. ఈ సమావేశం తర్వాత రెక్స్ టిల్లర్సన్, మెక్ మస్టర్ ఇద్దరూ పదవుల నుంచి వైదొలగటం గమనార్హం. ఆ తర్వాత రోజు అంటే ఆగస్టు 11న, వెనెజులాపై సైనిక చర్యకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ట్రంప్ హఠాత్తుగా ప్రకటించి కలకలం రేపారు. ఆపై కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యువల్ సాంటోస్‌కు ఫోన్ చేసి ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు ఆ దేశ ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో ఐరాస సమావేశంలో పాల్గొనేందుకు వాషింగ్టన్ చేరుకున్న కొలంబియా, మరో మూడు లాటిన్ అమెరికా దేశాధినేతలతో ట్రంప్ ఇదే విషయంపై చర్చించారు. వారు కూడా ఆయన ఆలోచనను వ్యతిరేకించారని ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘పొలిటికో’ పత్రిక పేర్కొంది. వెనెజులా రాజకీయ, ఆర్థిక సంక్షోభానికి ఒబామా హయాంలో ఇవ్వని ప్రాధాన్యాన్ని ట్రంప్ ఇస్తున్నారని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని పరిశీలకులు అం టున్నారు. కానీ, ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ విదేశాంగ విధానం అమెరికా విరోధులకు మరింత ఊతమిచ్చేలా ఉందని విమర్శిస్తున్నారు. -
ఉన్నతాధికారులతో స్పీకర్ భేటీ
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పలు సూచనలు హైదరాబాద్: శాసన సభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ ఎస్.మధుసూదనాచారి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశానికి మండలి చైర్మన్ స్వామిగౌడ్, సీఎస్ ఎస్.పి.సింగ్ హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి అధికారులకు స్పీకర్ పలు సూచనలు చేశారు. గత సమావేశాలకు సంబంధించి జీరో అవర్, ప్రత్యేక ప్రస్తావనలు, వాటికి ఇవ్వాల్సిన సమాధానాలను వెంటనే శాసనసభ సచివాలయా నికి పంపించాలని ఆదేశించారు. శుక్రవారం మొదలు కానున్న బడ్జెట్ సమావేశాల్లో సభ్యులు అడిగే ప్రశ్నలు, ఇతర నిబంధలనకు సంబంధించిన సమాచారం వెంటనే శాసన సభ సచివాలయానికి పంపించాలని సూచించారు. సమావేశాల సందర్భంగా భద్రత, తదితర అంశాలపై కూడా చర్చించారు. మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనసభ డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
యురిదాడిపై ప్రధాని మోదీ సమీక్ష
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి యురిదాడి ఘటనపై సమీక్షిస్తున్నారు. సోమవారం ప్రధాని తన అధికారం నివాసం రేసు కోర్సు రోడ్డు 7లో మంత్రులు, అధికారులతో భేటీ అయ్యారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జమ్ము కశ్మీర్లో యురి సైనికస్థావరంపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 20 మంది జవాన్లు వీరమరణం పొందగా, సైనికులు నలుగురు ముష్కరులను హతమార్చారు. ఈ దాడిని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ఏ చర్యలు తీసుకోవాలన్నదానిపై ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశంలో నిర్ణయిస్తారు. -
నెలాఖరున త్రివిధ దళాధిపతుల సమావేశం
న్యూఢిల్లీ: రక్షణ మంత్రి ఆంటోనీ ఈ నెల చివర్లో త్రివిధ దళాలతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ కేరన్ సెక్టార్లో ఆర్మీ 15 రోజులపాటు సాగించిన ఆపరేషన్‌పై ఎన్నో సందేహాలు నెలకొన్నందున ఈ అంశం ప్రధానంగా సమీక్షకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. పాక్ వైపు నుంచి పెద్ద ఎత్తున ఉగ్రవాదుల చొరబాటును తాము భగ్నం చేశామని ఆర్మీ 15 రోజుల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత ప్రకటించింది. అయితే ఈ ఆపరేషన్‌లో ఒక్క ఉగ్రవాది కూడా దొరకకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జరగబోయే సమావేశంలో కేరన్ అంశం చర్చకు రావచ్చని తెలుస్తోంది. త్రివిధ దళాల అధిపతులు, రక్షణ శాఖ కార్యదర్శి ఆర్కే మాథుర్ సమావేశానికి హాజరుకానున్నారు. జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ కూడా పాల్గొనవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 21 నుంచి ఆర్మీ కమాండర్ల నాలుగు రోజుల సదస్సు జరగనుంది. ఇందులో కేరన్ ఆపరేషన్‌కు సంబంధించి ఎన్నో అంశాలు చర్చించి.. అలాంటివి భవిష్యత్తులో ఎదురైనప్పుడు ఎదుర్కొనేందుకు వ్యూహాలు రూపొందించనున్నారు.