డిజిటల్ హెల్త్ కార్డులకు 60% మంది ఓకే

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ డిజిటల్ ఆరోగ్య మిషన్(ఎన్‌డీహెచ్‌ఎం) కింద కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ‘డిజిటల్ హెల్త్ ఐడీ’కి సుమారు 60 శాతం మంది ప్రజలు సానుకూలంగా స్పందించారు. కానీ, వైద్య, ఆరోగ్య రికార్డులు కాకుండా సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతపరిచేందుకు నిరాకరించారు. లోకల్‌సర్కిల్స్ అనే సోషల్ మీడియా వేదిక ఇటీవల దేశవ్యాప్తంగా 9 వేల మంది నుంచి హెల్త్ ఐడీకి సంబంధించిన 4 ప్రశ్నలపై చేపట్టిన సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. ఈ సర్వే వివరాలను డిజిటల్ హెల్త్ ఐడీలో పాలు పంచుకునే విభాగాలకు అందజేయనున్నట్లు లోకల్‌సర్కిల్స్ జనరల్ మేనేజర్ అక్షయ్ గుప్తా వివరించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎన్‌డీహెచ్‌ఎం పథకాన్ని ప్రకటించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి