ఆమ్‌ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం.. ఆ రాష్ట్రంలో యూనిట్‌ రద్దు.. తక్షణమే అమల్లోకి

Aam Aadmi Party Dissolves Tts Goa Unit With Immediate Effect - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. గోవాలోని తమ పార్టీ విభాగాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అమిత్‌ పాలేకర్‌ రాష్ట్ర పార్టీ చీఫ్‌గా కొనసాగుతారని వెల్లడించింది.  గోవాలో రాష్ట్ర కొత్త కార్యవర్గాన్ని త్వరలో నియమిస్తామని ఆప్‌ పేర్కొంది.

ఈ  మేరకు ఆప్‌ ట్వీట్‌ చేసింది. ‘గోవాలో అధ్యక్ష పదవి మినహా, పార్టీ మొత్తం విభాగాన్ని తక్షణమే రద్దు చేస్తున్నాం. అమిత్ పాలేకర్ మాత్రం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతారు. రాష్ట్రంలో పార్టీ కొత్త కార్యవర్గాన్ని త్వరలో ప్రకటిస్తాం’ అని తెలిపింది.

కాగా 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ  కూడా పోటీ చేసింది. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో రెండు చోట్ల ఆప్‌ అభ్యర్థులు విజయం సాధించారు. వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గోవాలో పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న పార్టీ రాష్ట్ర విభాగాన్ని ఆప్‌ రద్దు చేసినట్లు తెలుస్తున్నది.
చదవండి: ఆర్డినెన్స్‌ను ప్రధాని వెనక్కి తీసుకోవాలి..కేజ్రీవాల్‌కు కేసీఆర్‌ మద్దతు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top