సీఎం రేఖా గుప్తాపై కత్తితో దాడి ప్లాన్‌.. వెలుగులోకి సంచలన విషయాలు | Delhi CM Rekha Gupta Rajesh Sakriya Statement Details, Read Full Details Inside | Sakshi
Sakshi News home page

సీఎం రేఖా గుప్తాపై కత్తితో దాడి ప్లాన్‌.. వెలుగులోకి సంచలన విషయాలు

Aug 25 2025 9:16 AM | Updated on Aug 25 2025 11:19 AM

Delhi CM Rekha Gupta Rajesh Sakriya Statement Details

ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో నిందితుడిని విచారణగా.. సీఎం రేఖా గుప్తాను కత్తితో పొడవాలని ముందే ప్లాన్‌ చేసుకున్నట్టు తెలిసింది. అయితే, ముఖ్యమంత్రి వద్ద భారీ భద్రత కారణంగా ప్లాన్‌ను అమలు చేయలేదని నిందితుడు చెప్పినట్టు జాతీయ మీడియా పలు కథనాల్లో పేర్కొంది. దీంతో, ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది.

వివరాల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఇటీవల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆగస్టు 20న సివిల్‌ లైన్స్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో రేఖా గుప్తా ‘జన్‌ సున్వాయ్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా సకారియా రాజేశ్‌భాయ్‌ ఖిమ్జీభాయ్‌(41) ముఖ్యమంత్రిపై దాడి చేశాడు. పత్రాలను అందిస్తూ.. సీఎంపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. పెద్దగా కేకలు వేస్తూ.. చెంపదెబ్బ కొట్టాడు. ఆమెను వెనక్కు తోసేయడానికి ప్రయత్నించాడు. ఆమె జట్టును గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అనూహ్య ఘటనలో ముఖ్యమంత్రి తల, భుజం, చేతులకు గాయాలయ్యాయి.

ఇక, అతడి విచారణలో షాకింగ్‌ విషయాలు బయటకు వచ్చాయి. విచారణలో సకారియా..‘ఢిల్లీలో వీధి కుక్కలను తొలగించాలని నేను చాలా సార్లు అభ్యర్థించా. దీని గురించి సీఎం పట్టించుకోకపోవడంతోనే ఆమెపై దాడి చేయాలని నిర్ణయించుకున్నా. సీఎం అధికారిక నివాసానికి వెళ్లడానికి ముందు సుప్రీంకోర్టుకు వెళ్లా. న్యాయస్థానం బయట సెక్యూరిటీ చూసి అక్కడి నుంచి వచ్చేశా. అనంతరం సివిల్‌ లైన్స్‌లో ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లా. తొలుత ఆమెను కత్తితో పొడవాలని ప్లాన్‌ చేశా. కానీ, భద్రతా ఎక్కువగా ఉండటం చూసి కత్తిని బయటే పడేశాను’ అని చెప్పినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement