దేశ రాజధానిలో భారీగా తగ్గిన కరోనా కేసులు | 381 Fresh Covid Cases Reported In Delhi | Sakshi
Sakshi News home page

దేశ రాజధానిలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Jun 6 2021 5:02 PM | Updated on Jun 7 2021 8:01 AM

381 Fresh Covid Cases Reported In Delhi - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో ఢిల్లీలో 381 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇక గత 24 గంటల్లో 34 మంది కోవిడ్‌తో మృతి చెందారు. కొత్త మరణాలతో కలుపుకుని మొత్తం కోవిడ్‌ బాధితుల మరణాల సంఖ్య 24,591కు చేరింది.

ఇక గడిచిన 24 గంటల్లో 1,189 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 5,889 పాజిటివ్‌ కేసులు ఉండగా.. పాజిటివిటీ రేటు 0.5 శాతానికి తగ్గింది. ఇప్పటి వరకు దేశ రాజధాని ఢిల్లీలో 14.3 లక్షల మంది కరోనా బారిన పడ్డారు.


(చదవండి: వైరల్‌ వీడియో: ఈ సూపర్‌ హీరోకి నెటిజన్ల ఫిదా)

Advertisement
 
Advertisement
Advertisement