ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ.. సీసీటీవీ దృశ్యాలు వైరల్‌

2 Buses Collide head On Near Tamil Nadu Salem District - Sakshi

చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సేలం జిల్లా శంకరి సమీపంలో మంగళవారం సాయంత్రం రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఎడప్పాడి నుంచి శంకరి వెళ్తున్న ప్రైవేటు బస్సు.. తిరుచెంగోడ్‌ నుంచి వస్తున్న కళాశాల బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది కళాశాల విద్యార్థులతో సహా 40 మంది గాయాలయ్యాయి.

భాదితులంతా సేలం, ఎడప్పాడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సులోని సీసీ కెమెరాలో ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. డ్రైవర్‌ తన సీట్లోంచి ముందుకు ఎగిరిపడటం, బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతినడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కాగా డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని తేలింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top