అయిదేళ్లలో 12 లక్షల ఉద్యోగాలు

12 lakh jobs throughElectronics manufacturers production:Ravi Shankar Prasad - Sakshi

భారీ స్థాయిలో  స్మార్ట్‌ఫోన్లు, విడిభాగాల తయారీ ప్రతిపాదనలు

పీఎల్‌ఐ పథకం 22 కంపెనీలు దరఖాస్తు

సాక్షి, న్యూఢిల్లీ: రానున్న అయిదేళ్లలో భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కేంద్ర  ఐటీ శాఖ మంత్రి  రవిశంకర్ ప్రసాద్ శనివారం ప్రకటించారు. వివిధ దిగ్గజ ఎలక్ట్రానిక్ తయారీదారులు వచ్చే అయిదేళ్లలో దేశంలో భారీస్థాయిలో స్మార్ట్‌ఫోన్లు, విడిభాగాల తయారీ  చేసేలా ప్రతిపాదించారని,  తద్వారా ప్రత్యక్షంగా,  పరోక్షంగా  12 లక్షల వరకు ఉద్యోగాలు  సృష్టించనున్నారని వెల్లడించారు. 

ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ (పీఎల్‌ఐ) కింద దేశంలో రాబోయే ఐదేళ్లలో11 లక్షలకు కోట్ల రూపాయలకు పైగా  విలువైన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ విడిభాగాలు తయారు కానున్నాయని కేంద్రం మంత్రి  వెల్లడించారు. పెగాట్రాన్, శాంసంగ్ , రైజింగ్ స్టార్ , ఫాక్స్ కాన్, విస్ట్రాన్ ఐదు అంతర్జాతీయ బ్రాండ్లతో సహా మొత్తం 22 కంపెనీలు ఈ పథకం కింద 22 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని చెప్పారు. ఈ  కంపెనీల  7 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి చేయనున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో మూడు లక్షల ప్రత్యక్ష, తొమ్మిది లక్షల పరోక్ష ఉద్యోగాలు దేశీయంగా లభిస్తాయని పేర్కొన్నారు.  ఈ పథకం  ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహిస్తుందని, ఆత్మ నిర్భర్ భారత్‌  లక్ష్యాన్ని నెరవేరుస్తుందని భావిస్తున్నట్లు రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top