దేవరకద్ర రూరల్: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నీటి తరలింపు..రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. కొడంగల్ ప్రాంతానికి ప్రాజెక్టు నీటిని తరలించే ప్రతిపాదన అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. 2017లోనే అప్పటి ప్రభుత్వం నీటి కేటాయింపులు చేసిందని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి చెబుతుండగా.. ఇప్పుడు పాత జీఓను చూపించి తప్పించుకోవడం సరికాదని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. మరోవైపు బీజేపీ సైతం నీటి తరలింపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. రూ.499 కోట్లతో మిషన్ భగీరథ పనులకు టెండర్ నోటీసు వెలువడటంతో వివాదం మరింత ముదిరింది. నేతల వాదోపవాదాలు ఎలా ఉన్నా.. ఇప్పటికే పూర్తిస్థాయిలో సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న కోయిల్‌సాగర్ ఆయకట్టు రైతుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
2017 జీఓతో ఎమ్మెల్యే వివరణ
కోయిల్‌సాగర్ నుంచి కొడంగల్ ప్రాంతానికి నీటి త రలింపుపై ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి స్పందించారు. 2017లోనే అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల నుంచి తాగునీటి అ వసరాలకు నీటి కేటాయింపులు చేస్తూ జీఓ జారీ చే సిందని తెలిపారు. ప్రస్తుతం కొత్తగా అదనపు నీటిని తరలించడం లేదని, గతంలో జరిగిన కేటాయింపుల ప్రకారమే ప్రతిపాదనలు ఉన్నాయని వివరించారు. ఇందుకు సంబంధించిన జీఓను విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. అయితే మిషన్ భగీరథ ద్వారా రూ.499 కోట్లతో పనులకు టెండర్ నోటీసు జారీ కా వడంతో ఈ అంశంపై స్థానికంగా చర్చ మొదలైంది.
పాత జీఓతో సమస్యకు పరిష్కారమా?
మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి నీటి తరలింపు ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలోనే ఈ అంశాన్ని వ్యతిరేకించామని గుర్తుచేశారు. సర్వేలు, టెండర్ల ప్రక్రియ, ఇతర పనులు ముందుకు సాగుతున్న సమయంలో పాత జీఓను ప్రస్తావించడం వల్ల ప్రస్తుత సమస్యకు పరిష్కారం లభించదని పేర్కొన్నారు. కోయిల్‌సాగర్‌పై అదనపు భారం పడకుండా కొడంగల్ ప్రాంతానికి తాగునీటిని ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అందించాలని సూచించారు. స్థానిక ఆయకట్టు రైతుల ప్రయోజనాలకు భంగం కలగకుండా చూడాలని కోరారు.
కోయిల్‌సాగర్ ప్రాజెక్ట్
ఆయకట్టు రైతులసంగతేంటి?
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 2.276 టీఎంసీలు. ప్రాజెక్టు అసలు ఆయకట్టు 12 వేల ఎకరాలు కాగా, సగటున ఐదు వేల ఎకరాలకే సాగునీరు అందుతున్నట్లు కృష్ణానది యాజమాన్య బోర్డు గతంలో వెల్లడించిన సమాచారం పేర్కొంటోంది. మరోవైపు కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా 50,250 ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యం ఉంది. గ్రావిటీ కెనాల్, అజిలాపూర్ లిఫ్టులతో పాటు ప్రతిపాదిత చౌదర్‌పల్లి లిఫ్టు వంటి పథకాలతో ప్రాజెక్టుపై నీటి అవసరాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా తాగునీటి తరలింపు ప్రతిపాదన తెరపైకి రావడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాగునీటి అవసరాలు తీర్చడం ఎంత ముఖ్యమో.. ప్రాజెక్టుపై ఆధారపడిన రైతులకు సాగునీటి భరోసా కల్పించడం కూడా అంతే ముఖ్యం. రాజకీయ వాదనలకు ముగింపు పలుకుతూ ఆయకట్టు రైతుల నీటి హక్కులకు ఎలాంటి నష్టం జరగదన్న స్పష్టమైన హామీని ప్రభుత్వం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
కొడంగల్‌కు తరలింపుపై రాజకీయ దుమారం
నీటి కేటాయింపులు 2017లోనే
జరిగాయంటున్న ఎమ్మెల్యే
పాత జీఓతో సమస్యకు
పరిష్కారం కాదంటున్న మాజీ ఎమ్మెల్యే
తరలింపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న బీజేపీ
ఆయకట్టు రైతుల సాగునీటి భద్రతపై సర్వత్రా ఆందోళన
రైతుల పక్షాన పోరాటం చేస్తాం
కోయిల్‌సాగర్ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించే ప్రతిపాదనను నిలిపివేయాలని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొండ ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా ముందుగా స్థానిక ఆయకట్టు రైతుల సాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగితే బీజేపీ వారి పక్షాన నిలబడి ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు.


