సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు | - | Sakshi
Sakshi News home page

సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు

Nov 28 2026 1:26 AM | Updated on Nov 28 2026 1:26 AM

కోస్గి రూరల్‌: సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు పొందవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్‌, తెలంగాణా రైతు విజ్ఞాన కేంద్రం జిల్లా కో–ఆర్డినేటర్‌, శాస్త్రవేత్త సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మండలంలోని బోలోనిపల్లిలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పొలంబడి కార్యక్రమం నిర్వహించగా వారు హాజరై పలువురు రైతుల వరి, కంది, వేరుశనగ పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చీడపీడల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, పంట అవసరాలకు అనుగుణంగా సమతుల ఎరువులు వినియోగించాలని, వరి కోతల అనంతరం పంట అవశేషాలను కాల్చవద్దని, శాస్త్రవేత్తల సూచనలు తప్పక పాటించాలని సూచించారు. వేపనూనె, వ్యవసాయ సంబంధిత రసాయనాలను పలువురు రైతులకు పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్‌ దుకాణాలను తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, విక్రయ రిజిస్టర్లను పరిశీలించి ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్దేశిత ధరలకు మాత్రమే ఎరువులు, యూరియా విక్రయించాలన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే దుకాణలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. వారి వెంట డీపీడీ శాంతినిర్మల, ఏడీఏ నూతన్‌కుమార్‌, మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ, సర్పంచ్‌ వెంకటయ్య, ఏఈఓ వినోద్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

నీటి లభ్యత ఆధారంగా సాగు..

కొత్తపల్లి: ఖేత్‌ బచావో అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మద్దూరు మండలం ఖాజీపూర్‌లో రైతు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణా రైతు విజ్ఞాన కేంద్రం జిల్లా కో–ఆర్డినేటర్‌, సత్యనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్‌ ముఖ్యఅతిథిగా హాజరై రైతులకు పలు సూచనలు చేశారు. రైతులు వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు. యాసంగిలో నీటి లభ్యత, విద్యుత్‌ సరఫరా ఆధారంగా పంటలు సాగు చేయాలని, అధిక నీరు అవసరమయ్యే వరికి బదులు శనగ, పెసర, మినుము వంటి పప్పుధాన్యాలు, తక్కువ నీటితో సాగయ్యే పంటలు పండించాలన్నారు. పంటమార్పిడి చేపట్టాలని, ఆరుతడి పంటలు సాగుచేసిన లేదా సాగు చేయాల్సిన రైతులు ఏఈఓను సంప్రదించాలని సూచించారు. ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్ట్రీ కచ్చితంగా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సకలేష్‌, వ్యవసాయ విస్తరణ అధికారి రాకేష్‌, తారాసింగ్‌, సర్పంచ్‌ సాయప్ప, గ్రామపెద్దలు మరియు రైతు సోదరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement