ఊట్కూర్: ఊట్కూర్ రిజర్వాయర్ పనులను శుక్రవారం ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీధర్ పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులతో సమావేశమయ్యారు. పెద్ద చెరువును రిజర్వాయర్‌గా మార్చడంతో గట్టున ఉన్న గంగమ్మ గోర్లగడ్డ ముంపునకు గురవుతుందని.. ప్రభుత్వం 5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి కేటాయించాలని గ్రామస్తులు కోరారు. చెరువు అలుగుపై ఉన్న పురాతన శివాలయం, చెరువుకట్ట కింద ఉన్న శివాలయం ముంపునకు గురవుతున్నాయని పునర్నిర్మాణానికి ప్రత్యేక నిఽధులు కేటాయించాలని కోరారు. పెద్ద చెరువు ఆయకట్టు కాల్వలకు మరమ్మతు చేపట్టాలన్నారు. అనంతరం ఎస్‌ఈ శ్రీధర్ మాట్లాడుతూ.. ముంపునకు గురవుతున్న శ్మశానవాటిక, ఆలయాలను పరిశీలించి నివేదిక తయారుచేసి కలెక్టర్‌కు అందిస్తామని వివరించారు. ఈఈ గోవిందాచారి, మాజీ జెడ్పీటీసీ అరవింద్‌కుమార్, మాజీ సర్పంచ్ భాస్కర్, డీఈ శంకర్ పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన
కలిగి ఉండాలి
మక్తల్: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మక్తల్ మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి కాసర్ల అవినాష్ అన్నారు. శుక్రవారం మండలంలోని జక్లేర్ జెడ్పీఉన్నత పాఠశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని సాధించేందుకు క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకుసాగాలని సూచించారు. ప్రస్తుతం ఇంటర్‌నెట్, ఫోన్ వినియోగం పెరిగిందని, వాటితో సమాజానికి మంచి, చెడు ఉన్నాయని.. మంచిని గ్రహించి, చెడును దూరంగా ఉంచాలన్నారు. అంతకుముందు పాఠశాలకు మొదటిసారి వచ్చిన న్యాయమూర్తికి ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. సర్పంచ్ నిర్మలబాయి, ఉపాధ్యాయులు ప్రవీణ్‌కుమార్, ఆంజనేయులు, అంబురావు, వెంకట్రాములు, సిద్ధిరామేశ్వర్, వెంకటలక్ష్మి, బాలరాజు, షబానా, సోమనాథ్, ఈశ్వర్ పాల్గొన్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్
అధికారుల తనిఖీ
కొత్తపల్లి: ఉమ్మడి మద్దూరు మండలంలోని విద్యుత్ కాంట్రాక్టర్ల గోదాంలపై శుక్రవారం ఎలక్ట్రికల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. జాదరావుపల్లిలో ఉన్న విద్యుత్ కాంట్రాక్టర్లు చిన్న వెంకటయ్య, పెద్ద వెంకటయ్య ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకున్న గోదాంలను తనిఖీ చేశారు. రైతులకు అందిస్తున్న ఎలక్ట్రికల్ వైర్, కేబుల్, ట్రాన్స్‌ఫార్మర్‌లకు సంబంధించిన సామగ్రిని పరిశీలించినట్లు మద్దూరు విద్యుత్ ఏఈ నిరంజన్‌దాస్ తెలిపారు. ఎలాంటి అక్రమాలు జరిగాయనేది తెలియాల్సి ఉందని చెప్పారు.


