పంటపొలాలే ప్రయోగ క్షేత్రాలు | - | Sakshi
Sakshi News home page

పంటపొలాలే ప్రయోగ క్షేత్రాలు

Nov 18 2026 12:56 AM | Updated on Nov 18 2026 12:56 AM

జిల్లాలో కొనసాగుతున్న ‘ఇన్నోవేషన్‌ టు ఇంపాక్ట్‌’ కార్యక్రమం

● ప్రతి మండలంలో

సుమారు ఆరు గ్రామాలు ఎంపిక

● ఖేత్‌బచావ్‌తో వ్యవసాయశాఖ

అధికారులు, శాస్త్రవేత్తల

సమన్వయంతో ముందుకు

● గత నెల 22న ప్రారంభం..

నెలాఖరు వరకు కొనసాగనున్న అవగాహన సదస్సులు

జిల్లాలో ఇలా..

ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించేందుకు గత నెల 22 నుంచి ఈ నెల 30 వరకు ఖేత్‌బచావ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి మండలం నుంచి 6 గ్రామాలను ఎంపిక చేసి సుమారు 90 గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించగా.. ఇప్పటికే దాదాపు సగానికిపైగా గ్రామాల్లో పూర్తయ్యాయి. ప్రతి గ్రామంలో కనీసం 50 మంది నుంచి 100 మంది రైతులకు అవగాహన కల్పించేలా అధికారులు ముందుకుసాగుతున్నారు.

ఫ ఎల్‌నినో ప్రభావం కారణంగా తక్కువ నీ టితో చేతికందే పంటలతో పాటు పప్పుధానా లు, నూనెగింజల సాగును ప్రోత్సహిస్తున్నారు. జొన్న, శనగ ఆరుతడి పంటల సాగుకు ప్రతి మండలంలో ఆరు గ్రామాలను ఎంపిక చేసి ఆ సక్తిగల రైతులకు ఆయా గ్రామాల రైతువేదికల్లో వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విత్తన దశ నుంచి మొదలు పంట చేతికొచ్చే వరకు తమ పర్యవేక్షణలో సాగు జరిగేలా చర్యలు తీసుకుంటామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆధునిక వంగడాలు అందించడంతోపాటు సస్యరక్షణ చర్యలు, ఆధునిక సాంకేతికతను అందిస్తారు. కార్యక్రమాన్ని రెండేళ్ల పాటు కొనసాగించనున్నారు. ఆయా పంటల సాగులో రైతులు అనుసరిస్తున్న పద్ధతులు, విత్తనాలు, తెగుళ్ల నివారణ, పెట్టుబడి, దిగుబడి సేకరించి నమోదు చేస్తారు. కార్యక్రమ అమలు తర్వాత మారిన పరిస్థితులను రైతులు ప్రత్యక్షంగా తెలుసుకొనే వీలుందని వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

నర్వ: వ్యవసాయ పరిశోధన స్థానాల్లోని అంశాలు, ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికతను నేరుగా రైతులు పంటపొలాల్లో పాటించేలా ప్రభుత్వం ‘ఇన్నోవేషన్‌ టు ఇంపాక్ట్‌’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఖేత్‌ బచావ్‌ కార్యక్రమంలో భాగంగా ప్రొ. జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం, కృషి విజ్ఞాన, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాలు (టీఆర్‌వీకే ) జిల్లాలో యాసంగి సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. జొన్న, శనగ సాగులో సాంకేతిక అంతరాలను తగ్గించి దిగుబడులు, ఆదాయం పెంపే లక్ష్యంగా కార్యక్రమం చేపట్టారు. జిల్లావ్యాప్తంగా యాసంగిలో శనగ, జొన్న సాగు చేస్తారు. మేలురకం విత్తనాలు అందుబాటులో లేకపోవడం, రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు, సాంకేతిక పద్ధతులపై అవగాహన లేక ఆశించిన దిగుబడులు సాధించలేకపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement