ఎల్‌నినోను సమష్టిగా ఎదుర్కొందాం. | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినోను సమష్టిగా ఎదుర్కొందాం.

Nov 18 2026 12:56 AM | Updated on Nov 18 2026 12:56 AM

ఎల్‌నినోను సమష్టిగా ఎదుర్కొందాం. విత్తనోత్పత్తికి రైతుల ప్రోత్సాహం..

ఎల్‌నినో ప్రభావంతో యాసంగి సాగులో ఎదు రయ్యే ఇబ్బందులను సమష్టిగా ఎదుర్కొందాం.రైతులు నీటిలభ్యత ఆ ధారంగా ఆరుతడి పంటలు సాగుచేసేలా జిల్లా రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. మొత్తం 90 గ్రా మాల్లో రైతు అవగాహన సదస్సులు నిర్వహించేలా వ్యవసాయ అధికారులను సమన్వయం చేస్తున్నాం. ఎంపిక చేసిన గ్రామాల్లోని రైతువేదికల్లో నిర్వహించే అవగాహన కార్యక్రమానికి రైతులు హాజరై అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు వినాలి. పంటల సాగులో మెళకువలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలి. – సక్రియానాయక్‌, జిల్లా వ్యవసాయ అధికారి

నాబార్డ్‌ ఆర్థిక సాయంతో పీఏసీఎస్‌ల ద్వారా వరి విత్తనోత్పత్తికి మాగ నూ ర్‌, కృష్ణా, నర్వ మండలాలను పరిశీలించాం. క్షేత్రస్థాయిలో నాణ్యమైన స్వ చ్ఛమైన వరి విత్తనోత్పత్తికి రైతులు విత్తన ధ్రు వీకరణ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. విత్తనోత్పత్తి వైపు రైతులను ప్రోత్సహించేందుకు కృషిచేయాలి. విత్తనోత్పత్తిలో సాగు ఆరంభం నుంచి కోత వరకు అవసరమైన సలహాలు, సూచనలు టీఆర్‌వీకే తరఫున అందిస్తాం. – డా. ఈటెల సత్యనారాయణ,

టీవీఆర్‌కే శాస్త్రవేత్త, సమన్వయకర్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement