ప్రతి కుటుంబానికి జీవిత బీమా | - | Sakshi
Sakshi News home page

ప్రతి కుటుంబానికి జీవిత బీమా

Nov 18 2026 12:56 AM | Updated on Nov 18 2026 12:56 AM

నారాయణపేట: జిల్లాలో ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక ఆదేశించారు. మంగళవారం సంబంధిత అధికారులతో గూగుల్‌ మీట్‌ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పథకాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులు అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని అర్హులైన ప్రతి ఒక్కరికీ బీమా ప్రయోజనం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. కుటుంబ యజమాని వయస్సు 18 నుంచి 59 ఏళ్లలోపు ఉండాలని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో వార్డుల వారీగా కార్యాచరణ రూపొందించి పుర కమిషనర్లు పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమ నిర్వహణకు అవసరమైన లొకేషన్ల వివరాలను పంపించాలని ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణలో రేషన్‌ డీలర్ల సహకారం తీసుకోవాలని, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు సమర్పించాలని తెలిపారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన సేవలు అందించాలని, ప్రజాప్రతినిధులను కూడా కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు స్పష్టం చేశా రు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీను, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

పనుల్లో వేగవంతం పెంచాలి..

ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల, ఎంసీహెచ్‌ భవన నిర్మాణ పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆస్పత్రిలోని బ్లడ్‌బ్యాంక్‌, డయాలసిస్‌, ఈఎన్‌టీ తదితర విభాగాలపై ఆరాతీశారు. నర్సింగ్‌ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించి లోపల బ్యాడ్మింటన్‌ కోర్టు, బయట పికిల్‌బాల్‌, షటిల్‌గ్రౌండ్‌ ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డీవైఎస్‌ఓను ఆదేశించారు. ఆమె వెంట ఈఈ వేణుగోపాల్‌, ఏఈ సాయి మురారి, వైద్య కళాశాల సూపరింటెండెంట్‌ సంపత్‌, సంబంధిత అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement