మరికల్: వానాకాలం పండించిన వరిధాన్యం సేకరణకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నెలరోజులు దాటినా ఒక బస్తా వడ్లు కూడా రావడం లేదు. మార్కెట్లో ధాన్యానికి మంచి డిమాండ్ ఉండటం.. వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు కల్లాల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తుండటంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలవైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో కేంద్రాలన్నీ వెలవెలబోతున్నాయి. జిల్లావ్యాప్తంగా సాధారణంగా 1.80 లక్షల ఎకరాల్లో వరిసాగు కావాల్సి ఉండగా.. ఎల్నినో ప్రభావం కారణంగా 1.64 లక్షల ఎకరాలకు పరిమితమైంది. అందులో సన్నరకం ఆర్ఎన్ఆర్ 55శాతం మేర సాగైంది. ఈ సీజన్లో సుమారు 4. 20 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.అయితే ఎల్నినో ప్ర భా వంతో సుమారు 30వేల ఎకరాల్లో దిగుబడి అంత గా రాకపోవచ్చని అభిప్రాయానికి వచ్చారు. అందు కు అనుగుణంగా జిల్లావ్యాప్తంగా మొత్తం 164 కొ నుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం 103 కేంద్రాలను ప్రారంభించారు.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలవైపు
కన్నెత్తి చూడని రైతులు
ప్రైవేటులో అధిక ధరలే కారణం
జిల్లాలో 103 కేంద్రాలు ప్రారంభం
ఇప్పటి వరకు
ఒక బస్తా ధాన్యం రాని పరిస్థితి


