నేను ఐదెకరాల్లో వరిసాగు చేయగా.. నీళ్లు లేక ఎకరా పొ లం ఎండిపోయింది. నాలు గు ఎకరాల్లో 110 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రైవేటు వ్యాపారులు క్వింటాకు రూ. 3,800 ధర చెప్పడంతో వారికే విక్రయించాను.
– హన్మంతు, రైతు, ఎలిగండ్ల
మూడెకరాల్లో కేఎన్ఎం ఽరకం సాగు చేయగా.. 80 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ధాన్యం ఆరబెట్టిన చోటకే ప్రైవేటు వ్యాపా రులు వచ్చి క్వింటాకు రూ. 3,300 చొప్పున కొనుగోలు చేశారు. గతేడాది కంటే ఈసారి వరిపంట మంచి లాభం రావడం ఆనందంగా ఉంది.
– ఎల్లప్ప, రైతు, ఎల్లిగండ్ల
ప్రైవేటులో వరిధాన్యానికి అధిక ధరలు పలుకుతుండటంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు 103 కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. 70 శాతం వరికోతలు పూర్తికావొచ్చినా కొనుగోలు కేంద్రాలకు ఒక బస్తా ధాన్యం రాలేదు. ప్రస్తుత పరిస్థితుల మేరకు 70వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అనుకుంటున్నాం.
– సైదులు,
జిల్లా పౌరసరఫరాలశాఖ మేనేజర్


