నారాయణపేట: బాలల హక్కుల పరిరక్షణే సమాజ భవిష్యత్‌కు పునాది అని.. ప్రతి చిన్నారికి సురక్షితమైన బాల్యాన్ని అందించడం అందరి బాధ్యత అని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి సాయి మనోజ్‌కుమార్ అన్నారు. మండలంలోని బొమ్మన్‌పాడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సురక్షిత్ బచ్‌పన్ అభియాన్ ఫేజ్–2 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రతి బాలుడికి చదువుకునే హక్కు, ఆడుకునే హక్కు, స్వేచ్ఛగా ఎదిగే హక్కుతో పాటు సురక్షితంగా జీవించే హక్కు ఉందన్నారు. బాలల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పోక్సో చట్టం–2012పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ.. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మధ్య తేడాలను వివరించారు. అసురక్షిత స్పర్శ ఎదురైతే భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు లేదా నమ్మకమైన పెద్దలకు తెలియజేయాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా అసభ్యకర సందేశాలు పంపినా, బెదిరింపులకు పాల్పడినా వాటిని తేలికగా తీసుకోవద్దని సూచించారు. బాధితులు భయపడకుండా చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 లేదా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించవచ్చని అన్నారు. బాలలపై లైంగిక నేరాలకు పాల్పడితే చట్టప్రకారం అరెస్టు, జైలు శిక్ష వంటి కఠిన చర్యలు ఉంటాయని వివరించారు. అనంతరం ‘మేరా బచ్‌పన్ మేరా అధికార్.. నా బాల్యం నా హక్కు’ అనే నినాదంతో విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కె.లక్ష్మీపతిగౌడ్, ఎంఈఓ బాలాజీ, పోలీసు అధికారి సురేందర్ నాయక్ పాల్గొన్నారు.
హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
నారాయణపేట: బాలల హక్కుల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అన్నారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా.. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 25 మంది చిన్నారులు తమ సమస్యలు, అవసరాలు, అభ్యర్థనలకు సంబంధించిన దరఖాస్తులను కలెక్టర్‌కు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారుల అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, త్వరగా పరిష్కరించా లని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకు ముందు బాలల హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కలెక్టరేట్‌లో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బాల్యవివాహ రహిత భారత్ నిర్మాణంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులతో కలెక్టర్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
● ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఆమె నేరుగా తెలుసుకొని అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 27 అర్జీలు అందినట్లు కలెక్టరేట్ ప్రజావాణి విభాగం అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు డయల్
యువర్ ఎస్పీ
నారాయణపేట: ప్రజల సమస్యలు, ఫిర్యాదులను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు ఎస్పీ డా.వినీత్ ఆధ్వర్యంలో మంగళవారం డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహించన్నారు. మధ్యా హ్నం 12 నుంచి 1గంట వరకు ప్రజలు 0850– 6281182 నంబర్‌కు ఫోన్‌చేసి.. తమ ఫిర్యాదు లు, సమస్యలు, అభ్యంతరాలను నేరుగా తనకు తెలియజేయవచ్చని ఎస్పీ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎర్రకందులు క్వింటా రూ.11,221
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం ఎర్ర కందులు క్వింటాకు గరిష్టంగా రూ. 11,221, కనిష్టంగా రూ. 11,219 ధర పలికింది. హంస ధాన్యం (1010) గరిష్టంగా రూ. 2,451, కనిష్టంగా రూ. 2,363, కేఎన్‌ఎం వడ్లు గరిష్టంగా రూ. 3,630, కనిష్టంగా రూ. 2,870, సోన ధాన్యం గరిష్టంగా రూ. 3,966, కనిష్టంగా రూ. 2,523 ధరలు పలికాయి.


