సిండికేట్‌ దందా..! | - | Sakshi
Sakshi News home page

సిండికేట్‌ దందా..!

Nov 7 2026 1:18 AM | Updated on Nov 7 2026 1:18 AM

● కోతల ప్రారంభంలో క్వింటా రూ.3,700.. ప్రస్తుతం రూ.3,200

● దళారులు, వ్యాపారులు కుమ్మక్కు?

● పచ్చి ధాన్యం కొనుగోళ్లలోనూ మోసం

వరి ధాన్యం ధరలు రోజురోజుకు తగ్గిస్తున్న వ్యాపారులు

మరికల్‌: జిల్లాలో వరి కోతలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఏడు రకాల సన్నాలకు క్వింటాకు రూ.2,469 మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్‌ ఇస్తామని ప్రకటించింది. ఆ రకమే చాలా మంది రైతులు సన్నరకం వరిని మాత్రమే సాగు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితు లు నెలకొని ఆశించిన మేర పంట దిగుబడులు రాకపోవడంతో మార్కెట్‌లో బియ్యం ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఇదేఅదనుగా వేరే రాష్ట్రాల నుంచి వ్యాపారులు, దళారులు వచ్చి నేరుగా రైతుల పొలా ల వద్దకు వెళ్లి పూటకో రేటు మారుస్తూ వరి ధాన్యం కొనుగోలు చేస్తూ వారి కడుపు కొడుతున్నారు. సీజన్‌ ప్రారంభంలో ఉమ్మడి జిల్లా వ్యాపారులు పచ్చి ధాన్యం క్వింటా రూ.3,700 వరకు కొనుగోలు చేశారు. విద్యుత్‌ కోతలు, నీటిఎద్దడిని అధిగమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తోందని రైతులు ఆశపడగా.. అది ఎంతోకాలం నిలవలేదు. కొందరు దళారులు, స్థానిక రైసుమిల్లర్లు సిండికేట్‌ అయి ఇతర ప్రాంతాల వ్యాపారులు రాకుండా అడ్డుపడుతున్నారు.

ధర తగ్గుముఖం..

దళారులు రైతులను దోచుకుంటున్నా కట్టడి చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. 15 రోజు ల కిందట పచ్చి ధాన్యాన్ని వ్యాపారులు క్వింటా రూ.3,700 వరకు కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రాల కంటే అధికంగా ధర పలకడంతో ఆన్నదాతలు ఆనందపడ్డా రు. కోతలు ముమ్మరం కావడంతో వ్యాపారులు సిండికేట్‌ కావడంతో ప్రస్తుతం క్వింటా రూ.3,200 ఆరబెడితే రూ.3,700 వరకు కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. క్వింటాకు రూ. 500 తగ్గించి రైతుల కష్టాన్ని దోచ్చుకుంటున్నారు. తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులంతా హడావుడిగా కోతలు చేపట్టారు. ప్రైవేట్‌లో ధర ఉండటం కూడా కోతలు చేపట్టడానికి ఒక కారణం. వ్యాపారులు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకొని దోపి డీకి తెరలేపారు. అలాగే తూకంలోనూ క్వింటా 2 కిలోలు కోత విధిస్తున్నారు. దీంతో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులు నిలువునా దోచుకెళ్తున్నారు.

మరికల్‌లో కల్లాల వద్దనే పచ్చిధాన్యం కొనుగోలు చేస్తున్న వ్యాపారి (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement