నారాయణపేట: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోస్గి, కొడంగల్ ప్రాంతాల్లో మూడురోజుల పాటు పర్యటించనున్నందున ప్రతి శాఖ అధికారులు, సిబ్బంది కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వరి ్త స్తూ జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెనన్స్ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వి హంచిన సమీక్షలో ఆమె మాట్లాడారు. వివిధ కార్యక్రమాలకు హాజరయ్యే రైతులు, ప్రజల వివరాలను గ్రామాల వారీగా ముందుగానే సేకరించి సమగ్ర జాబితా సిద్ధం చేయాలన్నారు. ఎంపీడీఓలు, స ర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ అధికారులను సమన్వయం చేసుకుంటూ జన సమీకరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజ లు, రైతులను తరలించే బస్సుల నంబర్లు, బయలుదేరే సమయాలు, పోలీస్‌సిబ్బంది సంప్రదింపు నంబర్లతో ప్రత్యేక ఎక్సెల్‌షీట్ రూపొందించాలని ఆదేశించారు. బస్సులన్నీ ఉదయం 9లోపు కార్యక్రమ ప్రాంగణానికి చేరుకునేలా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అల్పాహారం, భోజనం సరఫరాలో ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఆహా ర పదార్థాల నాణ్యత, తాగునీటి శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పుర అధికారులు కార్యక్రమ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. విద్యుత్, తాగునీరు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను ముందుగానే పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత శాఖల ను ఆదేశించారు. పోలీస్‌శాఖ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, బస్సుల రాకపోకలు, ప్రజల భద్రతకు సంబంధించి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. అగ్నిమాపకశాఖ అవసరమైన వాహనాలు, సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మూడురోజుల కార్యక్రమాలు ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సజావుగా నిర్వహించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. సమయపాలన పాటిస్తూ కేటాయించిన విధులు నిర్వర్తించాలని, చిన్నపాటి పొరపాట్లకు కూడా అవకాశం ఇవ్వొద్దని ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఎస్‌డీసీ రాజేందర్‌గౌడ్, ఏఓ అనిల్‌కుమార్, ఆర్డీఓ రమేష్, సి–సెక్షన్ అధికారి జయసుధ, ప్రజారోగ్యశాఖ ఎస్‌ఈ విజయభాస్కర్, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ నవీన్‌కుమార్, డీఎంహెచ్‌ఓ డా. జయచంద్రమోహన్, జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్, డీపీఆర్వో రషీద్, పౌరసరఫరాలశాఖ డీఎం సైదులు, కోస్గి పుర కమిషనర్ నాగరాజు, మద్దూరు, గుండుమల్ తహసీల్దార్లు మహేశ్, భాస్కరస్వామి తదితరులు పాల్గొన్నారు.


