భద్రత లోపాలకు తావివ్వొద్దు : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

భద్రత లోపాలకు తావివ్వొద్దు : ఎస్పీ

Nov 7 2026 1:18 AM | Updated on Nov 7 2026 1:18 AM

కోస్గి రూరల్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోస్గి పురపాలికలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు వస్తున్న సందర్భంగా భారీ భద్రత కల్పించాలని ఎస్పీ వినీత్‌ అధికారులను ఆదేశించారు. కోస్గిలోని సర్‌ సీవీ రామన్‌ సైన్స్‌ మ్యూజియాన్ని సీఎం ప్రారంభించనున్నందున శుక్రవారం రూట్‌మ్యాప్‌, పార్కింగ్‌ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. ట్రాఫిక్‌ నియంత్రణలు, వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలను కేటాయించాలన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌ వచ్చిపోయే మార్గాల్లో రోడ్‌ ఓపెనింగ్‌ పార్టీలను ఏర్పా టు చేసి ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. రూట్‌మ్యాప్‌ సెంట్రీలు, రోప్‌ పార్టీలు, కీలక కూడళ్లలో ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేయాలని, బందోబస్తు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎలాంటి భద్రత లోపాలకు తావులేకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలన్నారు. అలాగే ముఖ్యమంత్రి తిరిగి వెళ్లే మార్గాన్ని ముశ్రీఫా సరిహద్దు వరకు స్వయంగా పరిశీలించి మార్గమధ్యంలో తీసుకోవాల్సిన భద్రత చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మ్యూజియం, పరిసరాల్లో డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. ఆయన వెంట డీఎస్పీలు లింగయ్య, మహేష్‌, సీఐ సైదులు, ఎస్‌ఐలు చంద్రశేఖర్‌, విజయ్‌కుమార్‌, భాగ్యలక్ష్మిరెడ్డి ఉన్నారు.

విద్యార్థులు పుస్తకాలకే

పరిమితం కావొద్దు

నారాయణపేట ఎడ్యుకేషన్‌: విద్యార్థులు పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా తమచుట్టూ ఉన్న సమస్యలను శాసీ్త్రయ దృక్పథంతో పరిశీలించి నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు వేియాలని జిల్లా విద్యాధికారి డా. గోవిందరాజు అన్నారు. శుక్రవారం మండలంలోని జాజాపూర్‌ ఉన్నత పాఠశాలలో జిల్లా సైన్స్‌ అధికారి భానుప్రకాష్‌ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి జాతీయ బాలల విజ్ఞాన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పోటీల్లో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల నుంచి మొత్తం 48 బృందాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఇందులో ప్రియాంక, స్వప్న (జెడ్పీహెచ్‌ఎస్‌, భోగారం)ప్రథమ, చందు, మనోవర్షిత్‌ (జెడ్పీహెచ్‌ఎస్‌, మద్దూర్‌) ద్వితీయ, అఖిల, అక్షయ (జెడ్పీహెచ్‌ఎస్‌, మరికల్‌) తృతీయ స్థానంలో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement