రైతు మేళాకు వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

రైతు మేళాకు వేళాయె..

Nov 7 2026 1:18 AM | Updated on Nov 7 2026 1:18 AM

కొడంగల్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన మెగా రైతు మేళా మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. కొడంగల్‌ నియోజకవర్గంలోని దుద్యాల మండలం హకీంపేట శివారులో ని ఎడ్యుకేషన్‌ హాబ్‌ సమీపంలో ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు రైతు మేళాతో పాటు ఇండస్ట్రియల్‌ ఎక్స్‌పోను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. మూడు రోజుల పాటు ఆధునిక వ్యవసాయ పనిముట్లను ప్రదర్శిస్తారు. పలు ప్రాంతాల నుంచి రైతులు, పారిశ్రామిక వేత్తలు, సందర్శకులు హాజరుకానున్నారు. వ్యవసాయ, ఉద్యాన, పరిశ్రమల శాఖలకు చెందిన అధికారులు, శాస్త్రవేత్తలు ఆధునిక వ్యవసాయం, పనిముట్లపై రైతులకు అవగాహన కల్పిస్తారు. 60 ఎకరాల విస్తీర్ణంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పంట ఉత్పత్తుల పెంపు, వ్యవసాయంలో వస్తున్న మార్పులు, సాగునీటి వినియోగం, సబ్సి డీలు, సేవలు, సంక్షేమం గురించి వివరిస్తారు. వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో 200 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధి, అధునాతన యంత్రాల వినియోగం, సాగు విధానాలపై పలు సూచనలు సలహాలు ఇస్తారు. 9వ తేదీ సోమవారం సుమారు 50 వేల మంది రైతులతో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. వీఐపీ, వీవీఐపీ, అధికారులు, పోలీసులు, ప్రెస్‌, సందర్శకులు, రైతుల కోసం భోజనశాలలు ఏర్పాటు చేశారు. రైతులు, అధికారులు, పారిశ్రామిక వేత్తలతో సీఎం చర్చించడానికి సమావేశ కుటీరాలను అందంగా తీర్చిదిద్దారు.

నేడు ప్రారంభించనున్న

సీఎం రేవంత్‌రెడ్డి

మూడురోజుల పాటు కార్యక్రమాలు

ఆధునిక వ్యవసాయ సామగ్రి ప్రదర్శన

సందర్శకుల కోసం భారీ ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement