● తెల్లవారుజామున కంపించిన భూమి.. రిక్టర్ స్కేలుపై 2.5గా నమోదు
● నల్లగట్టు నుంచి
రాయిచూర్ రోడ్ మార్గంలో..
నారాయణపేట: జిల్లాలో శుక్రవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారికంగా నమోదు చేసింది. మాగనూరు మండలం నల్లగట్టు మారెమ్మ ఆలయ సమీపంలో అభిషేక్ ఫ్యామిలీ రెస్టారెంట్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు సమీపంలో స్వల్పంగా భూమి కంపించినట్లు పేర్కొన్నారు. ఉదయం 6 గంటల 16 నిమిషాల 46 సెకన్లకు ప్రకంపనలు చోటుచేసుకోగా.. రిక్టర్ స్కేలుపై 2.5 తీవ్రత నమోదైంది. భూమి ఉపరితలం నుంచి సుమారు 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తక్కువ తీవ్రత కలిగిన ప్రకంపనలు కావడంతో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
ప్రమాద బాధితులకు
ప్రాణదాతగా పీఎం రాహత్
నారాయణపేట: కేంద్ర ప్రభుత్వం పీఎం రాహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించనున్నట్లు జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హెల్ప్‌లైనన్ నంబర్ 112కు సమాచారం అందించాలన్నారు. అత్యవసర సహాయ బృందాలు బాధితుడిని సమీపంలోని నిర్దేశిత ఆస్పత్రికి తరలించేందుకు సహకరిస్తాయని, తక్షణ వైద్యసాయం అందేలా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన తేదీ నుంచి ఏడురోజుల వరకు పథకం నిబంధనల ప్రకారం చికిత్స ఖర్చులకు కవరేజీ ఉంటుందన్నారు.
ఎన్‌హెచ్‌ఎం శిబిరంలో ధన్వంతరి హోమం
నారాయణపేట: డిమాండ్ల సాధన కోసం జాతీ య ఆరోగ్య మిషన్ (ఎన్‌న్‌హెచ్‌ఎం) ఉద్యోగు లు జిల్లాకేంద్రంలోని మున్సిపల్ పార్కు దగ్గర చేపట్టిన దీక్షలు శుక్రవారం 25వ రోజుకు చేరాయి. ధర్నా శిబిరంలో ఉద్యోగులు ధన్వంతరి జయంతి, ధన త్రయోదశి సందర్భంగా ప్రత్యేక ధన్వంతరి హోమం నిర్వహించారు. త మ న్యాయమైన డిమాండ్లు నెరవేరి జీవితాల్లో సంతోషం, భద్రత వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఏళ్లుగా ఆరోగ్యశాఖలో సేవలందిస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఉద్యోగులు కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రధానకార్యదర్శి వెంకటరమణ, కోశాధికారి రాఘవేందర్, సభ్యులు వినోద్, కిరీటి, తిరుపతి, మోనేష్‌చారి, విరోజా, రేణుక, సౌందర్య, గాయత్రి, నవీన, సుమన, రామేశ్వరి, ఆశాజ్యోతి, సావిత్రమ్మ, రామలింగమ్మ, నాగజ్యోతి, సుమిత్ర, అలివేలు పాల్గొన్నారు.
రూ.230కే సిమెంట్ సంచి
ధన్వాడ: ప్రభుత్వం కొత్తగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి రూ.230కే సిమెంట్ సంచి అందిస్తుందని డీఈ హరికృష్ణ తెలిపారు. శుక్రవారం మండలంలోని గోటూర్‌లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఏఈ జయన్నతో కలిసి పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇంటి నిర్మాణానికి మొత్తం 260 సంచుల వర కు అందిస్తుందని.. అవసరం ఉన్న వారు సంబంధిత పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రతి లబ్ధిదారు 50 బ స్తాలకు తగ్గకుండా దరఖాస్తు చేసుకుంటే సర ఫరా చేస్తామని.. గ్రామానికి ఒక లారీలో 721 సంచులు వస్తాయని తెలిపారు. లారీకి జీపీఎస్ ఉండటంతో లబ్ధిదారుడి ఇంటి వద్దకే వస్తుందని.. లోకేషన్ సరిపోతేనే సంచులను దించుతా రని వివరించారు. సిమెంట్ డబ్బులు మినహా మిగతా డబ్బులను లబ్ధిదారు ఖాతాలో జమ చేస్తారని.. త్వరలో స్టీల్ కూడా అందించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగమణి, పంచాయతీ కార్యదర్శి శేఖర్‌రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ వెంకట్‌రెడ్డి ఉన్నారు.
వరి క్వింటా రూ.3,951
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో శుక్రవారం వరి ధాన్యం (సోన రకం) క్వింటా గరిష్టంగా రూ.3,951, కనిష్టంగా రూ.2,620.. హంసరకం సరాసరి ధర రూ.2,351 పలికింది.


