రైతుమేళాకు పకడ్బందీ ఏర్పాట్లు.. | - | Sakshi
Sakshi News home page

రైతుమేళాకు పకడ్బందీ ఏర్పాట్లు..

Nov 5 2026 1:16 AM | Updated on Nov 5 2026 1:16 AM

రైతుమేళాకు పకడ్బందీ ఏర్పాట్లు..

సమావేశంలో పాల్గొన్న వ్యవసాయశాఖ అధికారులు

ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు కొడంగల్‌ నియోజకవర్గంలో నిర్వహించనున్న రైతుమేళాకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సూచించారు. రైతుల సమీకరణ, స్వాగతం, ఆస్తుల పంపిణీ, ముఖ్యమంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనే రైతుల ఎంపికకు కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రతి విభాగానికి బాధ్యతలు కేటాయించి విధుల ఉత్తర్వులు జారీ చేయాలని, రోజువారీ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. రైతుల సంక్షేమం, పంట నష్టాల అంచన, ప్రభుత్వ సహాయక చర్యల అమలులో అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు అండగా నిలవాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్‌, ఉద్యాన అధికారి సాయిబాబా, మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement