పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయం

Oct 29 2026 12:54 AM | Updated on Oct 29 2026 12:54 AM

విధుల్లో నిర్లక్ష్యానికి తావులేదు..

నారాయణపేట: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ వినీత్‌ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద ఎస్పీ సైకిల్‌ ర్యాలీ ప్రారంభించారు. ఆర్డీఓ కార్యాలయం, పాత బస్టాండ్‌, మెయిన్‌ చౌక్‌, సుభాష్‌రోడ్‌, సత్యనారాయణ చౌరస్తా, యాద్గిర్‌ రోడ్‌, అంబేడ్కర్‌ చౌరస్తా, మున్సిపల్‌ పార్క్‌ మీదుగా పరేడ్‌ మైదానం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం పోలీసులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 154 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని.. వారి త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, అమరవీరుల ఆశయాలను కొనసాగించడం పోలీసు అధికారులు, సిబ్బంది బాధ్యతన్నారు. పోలీస్‌శాఖ ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు పోలీసుల విధులు, బాధ్యతలపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు, యువత ప్రజాభద్రత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం, సామాజిక బాధ్యత వంటి విలువలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. సైకిల్‌ర్యాలీ ఆరోగ్య పరిరక్షణతో పాటు పర్యావరణ కాలుష్య నియంత్రణకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అదనపు ఎస్పీ ఎండి రియాజ్‌ హుల్‌హక్‌, డీఎస్పీలు మహేష్‌, నల్లపు లింగయ్య, సీఐలు శివశంకర్‌, రాంలాల్‌, భగవంత్‌రెడ్డి, సైదులు, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, సతీష్‌రెడ్డి, విజయ్‌కుమార్‌, చంద్రశేఖర్‌, పురుషోత్తం, భాగ్యలక్ష్మిరెడ్డి, కృష్ణంరాజు, రాజు, నవీద్‌, మహేందర్‌రెడ్డి, గాయత్రి, రేవతి, శిరీష, శివశంకర్‌, రాంలాల్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఽదన్వాడ: విధుల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రజలకు సమర్థ సేవలు అందించాలని ఎస్పీ వినీత్‌ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆయన సందర్శించి రికార్డులు, ఆవరణను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై పెండింగ్‌ కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కేసుల దర్యాప్తు, పెండింగ్‌ కేసుల పరిష్కారం, రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి కేసును నిరంతరం పర్యవేక్షిస్తూ చట్టపరమైన నిబంధనలను పాటిస్తూ నిర్ణీత సమయంలో దర్యాప్తు పూర్తి చేయాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలీసు నిఘాను మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని సృష్టం చేశారు. ఆయన వెంట డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ భగవంత్‌రెడ్డి, ఎస్‌బీ ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి, ఐటీకోర్‌ ఎస్‌ఐ మల్లేష్‌, డీసీఆర్బీ ఎస్‌ఐ బాలరాజు, ధన్వాడ ఎస్‌ఐ కృష్ణంరాజు, ఎస్‌ఐ–2 మహేశ్వరి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement