నారాయణపేట: స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవా రం దివ్యాంగుల బస్‌పాస్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్టీసీ డిపో మేనేజర్ వై.యాకన్న హాజరుకాగా.. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాలకు చెందిన 20 మంది ది వ్యాంగులు దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధానకార్యదర్శి కావలి నర్సింహులు మాట్లాడుతూ.. బస్సుల్లో దివ్యాంగుల కోసం కేటా యించిన సీట్లలో వారికే ప్రాధాన్యం కల్పించేలా డ్రైవర్లు, కండక్టర్లకు తగిన ఆదేశాలు ఇవ్వాలని డిపో మేనేజర్‌కు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బస్‌పాస్ కంట్రోలర్ (ఏడీసీ) దేవుజ, బస్‌పాస్ సెక్షన్ ఇన్చార్జి పకీరప్ప, పరిరక్షణ సమితి ప్రతినిధులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.


