కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల దీక్షలు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల దీక్షలు

Oct 29 2026 12:54 AM | Updated on Oct 29 2026 12:54 AM

నారాయణపేట: జిల్లాకేంద్రంలోని మున్సిపల్‌ పార్కు ఎదుట జాతీయ ఆరోగ్య మిషనన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు టీజీఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు బుధవారం 16వ రోజుకు చేరాయి. ఉద్యోగుల ఆందోళనకు సీపీఐ, పీఆర్టీయూ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మా ట్లాడుతూ.. ఏళ్లుగా ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేసి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించాలని సూచించారు. డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు తెలిపారు. టీఎస్‌ పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వై.జనార్దన్‌రెడ్డి, సీపీఐ నాయకుడు వెంకట్రామారెడ్డి మద్దుతు తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం యూనియన్‌న్‌ అధ్యక్షుడు ప్రసాద్‌, ప్రధానకార్యదర్శి వెంకటరమణ, కోశాధికారి రాఘవేందర్‌, సభ్యులు నర్సింహరావు సగరి, మోనేష్‌చారి, తిరుపతి, శ్రీలత, అర్చన, ఐశ్వర్య, నవ్య, దీప్తి, శ్వేతశ్రీ,, రామస్వామి, వినోద్‌, గాయత్రి, అజారుద్దీన్‌, ఆశాబీ, రామేశ్వరి, అపర్ణ, నాగజ్యోతి, పుష్ప, సుమిత్ర, అలివేలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement