భూ రీ–సర్వేతో శాశ్వత ప్రయోజనాలు | - | Sakshi
Sakshi News home page

భూ రీ–సర్వేతో శాశ్వత ప్రయోజనాలు

Oct 28 2026 1:24 AM | Updated on Oct 28 2026 1:24 AM

కోస్గి రూరల్‌/కొత్తపల్లి: భూముల రీ–సర్వే పూర్తయితే రైతులకు ఉన్న సరిహద్దు వివాదాలు, రికార్డుల ఇబ్బందులు తొలగి శాశ్వత లబ్ధి చేకూరుతుందని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీను తెలిపారు. మంగళవారం మండలంలోని ముశ్రీఫా, చంద్రవంచలో ప్రభుత్వ భూములను, అలాగే కొత్తపల్లి మండలంలోని లింగాల్‌చేడ్‌లో కొనసాగుతున్న భూ రీ–సర్వేను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూ రీ–సర్వేతో ప్రతి రైతు భూమికి సంబంధించి కచ్చితమైన కొలతలతో పక్కా సరిహద్దులు నిర్ధారణ అవుతాయని తెలిపారు. దీంతో భవిష్యత్‌లో పొరుగు రైతులతో ఎలాంటి భూ వివాదాలు ఉత్పన్నం కావని చెప్పారు. సర్వే పూర్తయిన తర్వాత భూముల వివరాలన్నీ డిజిటలైజ్‌ అయి ఆస్తులపై పూర్తి హక్కులు భద్రంగా ఉంటాయని పేర్కొన్నారు. సర్వేయర్లు సర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని, రైతులకు పూర్తిగా సహకరించాలని అదికారులను ఆదేశించారు. గ్రామాల్లో నిర్వహించే సర్వే ప్రక్రియను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని, సర్వే బృందాలకు తగిన సహకారం అందించాలని కోరారు. కోస్గి మండలంలోని గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి కంచె నిర్మించాలని కోరారు. ముశ్రీఫాలోని 470, 256, 438, 452 సర్వేనంబర్లలో ప్రభుత్వ భూములు, చంద్రవంచ గ్రామంలోని సర్వే నంబరు 52లోని భూముల సర్వే చేపట్టి కంచె ఎర్పాటు చేయాలని రెఅదేశించారు. రెండు గ్రామాల్లో సుమారు 350 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని.. వారంలోగా నివేదికను అందజేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మండల డిప్యుటీ తహసీల్దార్‌ కవితాబాయి, ఆర్‌ఐ శ్రీనివాస్‌గౌడ్‌, డీఐఓ సర్వేయర్‌ సుశీల, లెసెన్స్‌డ్‌ సర్వేయర్లు నరేష్‌గౌడ్‌, సర్పంచ్‌ విజయలక్ష్మి పటేల్‌, జీపీఓలు కృష్ణ, మహిపాల్‌రెడ్డి, కోస్గి మండలలో ఆర్‌ఐ సుభాష్‌, జీపీఓ లింగయ్య, సర్వేయర్‌ శ్రీనివాస్‌, చైన్‌మెన్‌ మల్లేష్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement