కోస్గి: రాబోయే మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా, నిరుద్యోగ వ్యతిరేక విధానాలను పట్టభద్రులు తమ ఓటు హక్కుతో తిప్పికొట్టాలని ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ, కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి చల్లా నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగవారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పట్టభద్రుల సన్నాహక సమావేశం నిర్వహించగా.. వారు పాల్గొని మాట్లాడారు. చట్టసభల్లో నిరు ద్యోగులు, విద్యావంతుల సమస్యలపై గళం విప్పే ఏకై క పార్టీ బీఆర్‌ఎస్ అన్నారు. అధికారంలోకి వస్తే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ పార్టీ అధికార పీఠం ఎక్కాక పట్టించుకోలేదని తెలిపారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని, ఫీజు రియింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్‌లు సకాలంలో విడుదలగాక విద్యార్థులను వి ద్యాసంస్థలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నా యని చెప్పారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి బుద్ది చెప్పాలంటే విద్యావంతుల గళం శాసనమండలిలో వినబడాలని.. అందుకోసం బీఆర్‌ఎస్ పార్టి అభ్యర్థి ని గెలిపించాలన్నారు. అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6లోపు ఓటరుగా నమోదు చేయించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకట్‌నర్సింహులు, నీలప్ప, కోట్ల మహిపాల్, నరేందర్‌రెడ్డి, గోపాల్, సాయిలు, మధుయాదవ్, యాదగిరి, దినేష్, చికినె అంజయ్య, నర్సింహ, తిరుపతి, మహిపాల్‌రెడ్డి, వెంకటేష్, నీలప్ప, శ్యాసం రామకృష్ణ, పోషప్ప, నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


