నారాయణపేట: ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించి మెరుగైన సేవలందించాలని ఎస్పీ డా. జి. వినీత్ సూచించారు. మాగనూరు ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన మహేందర్‌రెడ్డి శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించేలా విధులు నిర్వర్తించాలన్నారు.
పోలీసులకు
వ్యాసరచన పోటీలు
నారాయణపేట: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని ఎస్పీ డా. జి.వినీత్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి వివిధ అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ ఉల్‌హక్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పోటీలను ఆయన పరిశీలించి మాట్లాడారు. పోలీసు సిబ్బందిని రెండు కేటగిరీలుగా విభజించి పోటీలు నిర్వహించామన్నారు. కేటగిరీ–1లో కానిస్టేబుల్ నుంచి ఏఎస్‌ఐ స్థాయి వరకు పనిచేస్తున్న సిబ్బందికి.. కేటగిరీ–2లో ఎస్‌ఐ నుంచి పైస్థాయి అధికారుల వరకు వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు వివరించారు. పోలీసు వ్యవస్థలో ప్రజాసేవ, వృత్తిపరమైన నైపుణ్యం, సామాజిక బాధ్యత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై అధికారులు, సిబ్బందిలో అవగాహన పెంపొందించడం పోటీల ప్రధాన ఉద్దేశమని వివరించారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చిన వారి వ్యాసాలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రస్థాయిలో బహుమతులు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆయన వెంట ఆర్‌ఐ విజయభాస్కర్, ఎస్‌ఐలు కృష్ణ చైతన్య, శిరీష తదితరులు ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
కొత్తపల్లి: రాష్ట్రంలో ఏ ఒక్క పేద కుటుంబం గుడిసెలో ఉండకూడదని.. వారి సొంతింటి కలను సాకారం చేయాలనే కృతనిశ్ఛయంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నారని హౌజింగ్ పీడీ శంకర్‌నాయక్ తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను సకాలంలో నాణ్యతగా నిర్మించుకోవాలని సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో జిల్లా గృహ నిర్మాణశాఖ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఇళ్ల నిర్మాణ విధానం గురించి క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమానికి కొత్తపల్లి, మన్నాపూర్ లబ్ధిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బేస్‌మెంట్, గోడలు, స్లాబ్, ప్లాస్టరింగ్ ఇలా ప్రతి దశ పూర్తయిన వెంటనే అధికారులకు సమాచారం ఇస్తే విడతల వారీగా డబ్బులు వెంటనే విడుదల అవుతాయని వివరించారు. ఎలాంటి సందేహాలున్నా ఏఈ, గ్రామపంచాయతీ కార్యదర్శిని సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మాణం చేపట్టి త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి మంజూరుపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఏఈ శాంతకుమార్, కొత్తపల్లి సర్పంచ్ చెన్నప్ప, పంచాయతీ కార్యదర్శి శ్రీను, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, లబ్ధిదారులు పాల్గొన్నారు.


