దర్యాప్తులో నాణ్యత పాటించాలి | - | Sakshi
Sakshi News home page

దర్యాప్తులో నాణ్యత పాటించాలి

Sep 30 2026 2:04 AM | Updated on Sep 30 2026 2:04 AM

నారాయణపేట: కేసుల దర్యాప్తులో శాసీ్త్రయ ఆధారాలు సేకరించాలని, పెండింగ్‌ కేసులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని డీఎస్పీ నల్లపు లింగయ్య ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని పట్టణ పోలీస్‌స్టేషనన్‌ను సందర్శించారు. తొలుత సిబ్బందితో మాట్లాడి విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్‌లోని రికార్డులు, క్రైమ్‌ వివరాలు, పెండింగ్‌ కేసులు, దర్యాప్తు పురోగతి, సీసీటీఎన్‌ఎస్‌ నమోదు, బీట్‌ వ్యవస్థ, ఫిర్యాదుల స్వీకరణ, సీసీ కెమెరాలు, ఆయుధాలు, ప్రభుత్వ ఆస్తుల భద్రత తదితర అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, ప్రజలకు పోలీస్‌శాఖపై నమ్మకం పెరిగేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. సైబర్‌, ఎన్‌డీపీఎస్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, మహిళలు, పిల్లలు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆయన వెంట సీఐ శివశంకర్‌, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, గాయత్రితో పాటు పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement