విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై దృష్టి

Sep 30 2026 2:04 AM | Updated on Sep 30 2026 2:04 AM

నారాయణపేట: కాంప్లెక్స్‌ స్థాయి సమావేశాలు, పాఠశాలల తనిఖీలు, ఎఫ్‌ఎల్‌ఏ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యానికి తావులేకుండా పక్కా ప్రణాళికతో చేపట్టాలని కలెక్టర్‌ ప్రియాంక విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎంఈఓలు, హెచ్‌ఎంలు, విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన పాఠశాలల సందర్శనల్లో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి పాఠశాలను తప్పనిసరిగా సందర్శించి విద్యా కార్యక్రమాల అమలును పరిశీలించాలని సూచించారు. కాంప్లెక్స్‌ సమావేశాలను ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలు, విద్యార్థుల అభ్యసన ఫలితాల మెరుగుదలకు ఉపయోగపడేలా నిర్వహించాలన్నారు. ప్రతి కాంప్లెక్స్‌ హెచ్‌ఎం నుంచి సింగిల్‌పేజీ నివేదిక తీసుకోవాలని, అందులో ఎఫ్‌ఎల్‌ఏ అమలు, బెస్ట్‌ ప్రాక్టీసెస్‌, టీఎల్‌ఎం వినియోగం, ఇంగ్లిష్‌ రెమిడియల్‌ తరగతులు, ప్రత్యేక కార్యక్రమాల వివరాలను పొందుపర్చాలని ఆదేశించారు. టీఎల్‌ఎంలను ఎన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేశారు, ఏ బోధనా సామగ్రిని తయారుచేసి వినియోగిస్తున్నారనే వివరాలను ఫొటోలతో సమర్పించాలన్నారు. ప్రతి కాంప్లెక్స్‌కు రెండు పేజీల సమగ్ర నివేదిక రూపొందించాలని సూచించారు. విద్యార్థుల ప్రస్తుత అభ్యసన స్థాయిని గత ఫలితాలతో పోల్చి పురోగతిని నమోదు చేయాల తెలిపారు. ఏఆర్‌ నివేదికలు, గ్రేడింగ్‌, విద్యార్థుల పనితీరును విశ్లేషించి వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. పాఠశాలల తనిఖీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి లోపాలు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యల నివేదికలు సమర్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఎస్‌ఏ–1 పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఎఫ్‌ఎల్‌ఏ, మిడ్‌టర్మ్‌ రివ్యూలు, కాంప్లెక్స్‌ సమావేశాలు, పాఠశాలల తనిఖీలను సమన్వయంతో నిర్వహించేలా డీఈఓ కార్యాలయం నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. అనంతరం స్టూడెంట్స్‌ ప్రాక్టీస్‌ వర్క్‌షీట్‌ బుక్‌లెట్లను కలెక్టర్‌ ఆవిష్కరించారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్‌ ఫణికుమార్‌, డీఈఓ గోవిందరాజు, ఏఎంఓ విద్యాసాగర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement