ఇటీవల జూరాల ఆయకట్టు రైతులు ఎందుకు ఆందోళనలకు దిగాల్సి వచ్చిందో పాలకులు, ప్రతిపక్షాలు గ్రహించాలి. ఎల్ నినో, వర్షాభావం వల్ల అని భావించినా.. నీటి నిర్వహణ, ప్రా జెక్ట్‌లు, రిజర్వాయర్ల నిర్మాణంలో నిర్లక్ష్యం, ప్రభుత్వాల బాధ్యతారాహిత్యమే కారణాలు. స్వరాష్ట్రంలో 12 ఏళ్లు గడిచినా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తికాకపోవడం విచారకరం. జిల్లా రైతులకు మేలు చేసేలా ప్రాజెక్ట్‌లు, రిజర్వాయర్ల నిర్మాణంలో వేగం పెంచాలి. విమర్శలతోనే సమాధానం చెబుతామనుకుంటే వారికి ప్రజల చేతిలో గుణపాఠం తప్పదు. – రాజేందర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్


