పుర సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

పుర సమస్యల పరిష్కారానికి కృషి

Sep 5 2026 6:55 AM | Updated on Sep 5 2026 6:55 AM

నారాయణపేట: పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన కల్యాణ మండపం ఎంతో బాగుందని.. మరింత అభివృద్ధి చేసి అన్ని వర్గాలకు ఉపయోగపడేలా సహకరిస్తామని ఎంపీ డీకే అరుణ అన్నారు. పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయస్వామి ఆలయ ప్రాంగణంలో పద్మశాలి సంఘం నిర్మించిన కల్యాణ మండపాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించారు. ముందుగా భక్త మార్కండేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు క్యాత రఘునాథ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గతంలో మాజీ రాజ్యసభ సభ్యుడు రామచందర్‌ కల్యాణ మండప నిర్మాణానికి కృషి చేశారని గుర్తుచేశారు. నారాయణపేట పుర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

కనకాద్రి ఆలయానికి మహర్దశ..

నెమళ్లపల్లి కనకాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధికి సహకరిస్తామని ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం ఆలయాన్ని సందర్శించిన ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ సమీపంలో నిర్మించిన కామన్‌ వర్క్‌షెడ్‌ను ప్రారంభించారు. ఆలయ ఆవరణలో టీటీడీ కల్యాణ మండపం, బీటీ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పుర చైర్‌పర్సన్‌ కొండ శ్వేత, వైస్‌ చైర్‌పర్సన్‌ మంజుల, కౌన్సిలర్లు సత్య రఘుపాల్‌రెడ్డి, అరుణ, బీజేపీ రాష్ట్ర నాయకులు రతంగ్‌ పాండురెడ్డి, పగుడాకుల శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్‌, కార్యదర్శి తిలక్‌, కోశాధికారి కర్లినర్సింహులు, ఉపాధ్యక్షులు సంబారి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement