కురుమూర్తిస్వామి ఆలయం వద్ద
ఉట్లను కొడుతున్న గొల్ల కుర్మలు
ఉట్ల మండపం వద్దకు స్వామివారి ఉత్రవ
విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొస్తున్న సిబ్బంది
చిన్నచింతకుంట: మండలంలోని అమ్మపూరం కురుమూర్తి స్వామి ఆలయంలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఉట్ల మండపం వద్దకు భాజాభజంత్రీలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. మండపం వద్ద ప్రదక్షిణలు నిర్వహించి ఉట్ల కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి ఉట్ల తాడును లాగగా గొల్లకుర్మలు ఉత్సాహంగా ఉట్లను కొట్టారు. రాత్రి సమయంలో స్వామివారికి పవళింపు సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకను చూసేందుకు వివిధ గ్రామాలనుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బాల్‌రాజు, ఈఓ మదనేశ్వరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది, భక్తులు ఉన్నారు.


