ధన్వాడ: మండలంలోని కంసాన్‌పల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు శ్వేత వినూత్న కార్యక్రమాలతో తనదైన శైలిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. దీంతో ఈ పాఠశాలలో గతేడాది 40 మంది విద్యార్థులుండగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 75కు చేరింది. ప్రతి విద్యార్థి ఆంగ్లంలో మాట్లాడం విశేషం. ప్రతి శుక్రవారం అప్రిసియేషన్ ఫ్రైడే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో విద్యార్థులకు వారం పాటు బోధించిన పాఠాల్లో ఎంతవరకు ప్రగతి సాధించారో తెలుసుకుంటున్నారు. శనివారం నుంచి గురువారం వరకు తరగతుల వారీగా పర్ఫార్మెన్స్ గ్రూప్, పేపర్ రీలర్నింగ్ గ్రూప్, నాన్ పర్ఫార్మెన్స్ గ్రూప్ ఇలా విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా గ్రీన్, పింక్, వైట్ స్టార్స్ అవార్డులు అందజేస్తున్నారు. అవార్డు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సప్‌లో గాని ఇంటికి వెళ్లి చెప్పడం లాంటి పనులు చేస్తున్నారు. ఇలా చేయడంతో తమ బిడ్డకు స్టార్ వచ్చిందని.. రానివారు వచ్చేలా ఇంటి దగ్గర కూర్చోబెట్టి చదివిస్తున్నారు. ఇవేగాక వైఓసీ ఫలితాల ప్రదర్శన, నో బ్యాగ్ డే, టీఎల్‌ఎం, పప్పిట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తున్నారు. ఈ ఏడాది ఈమె రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై ంది.


