నారాయణపేట: చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం, సొసైటీల లావాదేవీలపై సమగ్ర విచారణ కోరుతూ సెప్టెంబర్ 9న కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు అఖిలపక్ష నాయకులు తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలో అఖిలపక్ష, వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. నారాయణపేట చేనేత సొసైటీల్లో రూ.51 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయని, అవినీతి ఆరోపణలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. చేనేత సొసై టీల్లో జరుగుతున్న ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు. సొసైటీలు చేనేత కార్మికుల సంక్షేమానికి పనిచేయాల్సి ఉండగా.. కొద్దిమంది స్వార్థ ప్రయోజనాలకు వేధికలుగా మారకూడదన్నారు. అర్హులైన కార్మికులకు సొసైటీల్లో సభ్యత్వం కల్పించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సొసైటీ లావాదేవీలను వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగిస్తున్న అధ్యక్ష, కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని, అక్రమాలకు పాల్పడిన వారిని సభ్యత్వాల నుంచి తొలగించాల ని డిమాండ్ చేశారు. నేతన్న బీమా యోజన కింద ప్రభుత్వం అందజేస్తున్న రూ.5 లక్షల బీమా ప్ర యోజనం అర్హులైన కార్మికులకు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గాంధీనగర్‌లో దశాబ్దాలుగా నివసిస్తున్న చేనేత కార్మికుల ఇళ్ల కు యాజమాన్య హక్కులు కల్పించాలన్నారు. మ హాధర్నాకు ముందు చేనేత కార్మికులను చైతన్యపర్చేందుకు వీధివీధిన సమావేశాలు నిర్వహిస్తామని నాయకులు తెలిపారు. అనంతరం చేనేత ఉద్యమానికి సంబంధించిన కరపత్రాన్ని అఖిలపక్ష నా యకులు విడుదల చేశారు. సమావేశంలో టీడీపీ రా ష్ట్ర నాయకుడు ఓం ప్రకాష్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బొదిగల శ్రీనివాసులు, తెలంగాణ రాష్ట్ర రక్షణసేన జిల్లా అధ్యక్షుడు గవినోల శ్రీనివాస్, సీఐటీయూ జి ల్లా కార్యదర్శి బలరాం, రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణ మడివాల్, చేనేత కార్మిక సంఘం సీనియర్ నాయకుడు కెంచి నారాయణ, జనసేన జిల్లా నాయకుడు గుడ్సె నర్సింహ, టీడీపీ నాయ కుడు రాఘవ నాయుడు, సీపీఎం పట్టణ నాయకుడు సోఫీ బజార్ హుస్సేన్, బీఎస్పీ నాయకులు అశోక్, గౌతమ్ శివ, అజయ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హౌజీ తుల్జారం, చేనేత కార్మిక సంఘం పట్టణ నాయకుడు యాబన్న చౌదరి పాల్గొన్నారు.


