అధికారులా మజాకా! | - | Sakshi
Sakshi News home page

అధికారులా మజాకా!

Aug 14 2026 7:56 AM | Updated on Aug 14 2026 7:56 AM

–8లో u

సొంత స్థలం లేని మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు..

కోస్గి: పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. ఇళ్ల మంజూరు, లబ్ధిదారుల ఎంపిక, బిల్లుల చెల్లింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి సొంత ఇలాఖాలో కొందరు అధికారులు నాయకులతో కుమ్మక్కవడంతో పథకం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. కోస్గి పుర పరిధిలో వెలుగు చూసిన ఓ ఘటనే అధికారుల అవినీతికి అద్దం పడుతోంది. కాగా తప్పు చేసింది మేము కాదంటే.. మేము కాదంటూ ఇటు పుర అధికారులు, అటు హౌజింగ్‌ అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం విశేషం.

పూర్తి వివరాలు పరిశీలిస్తే..

కోస్గి పుర పరిధిలోని 14వ వార్డులో ఉంటున్న కాకి చెన్నమ్మకు ఎలాంటి సొంత స్థలం లేకపోయినప్పటికీ అధికారపార్టీకి చెందిన ఓ నాయకుడు బిల్లులు రాగానే సగం డబ్బులు ఇస్తానని నమ్మించి ఆమె పేరుతో 290074/620722 అప్లికేషన్‌ నంబర్‌తో మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయించుకున్నారు. పుర అధికారులు ఊరికి దూరంగా ఉన్న వ్యవసాయ పొలంలో ఇంటి నిర్మాణానికి ముగ్గు వేసి త్వరితగతిన పనులు చేయించి తమవంతు సహకారం అందించారు. గతేడాది అక్టోబర్‌లో మొదటి విడత బెస్‌మెంట్‌ బిల్లు చెల్లించే క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారంలో అధికారుల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపడంతో కోస్గితో పాటు పోతిరెడ్డిపల్లిలో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. పోతిరెడ్డిపల్లిలో ఇళ్లు మంజూరుకాని వారికి ప్రొసీడింగ్స్‌ ఇచ్చి ఇంటి నిర్మాణం చేయించిన అధికారులు ఎలాంటి నిర్మాణం చేయని వారికి బిల్లులు చెల్లించిన ఘటన వెలుగులోకి రావడంతో సమగ్ర విచారణ చేపట్టి అర్హులైన వారికే బిల్లులు ఇవ్వాలని అప్పట్లో అధికారులు ఆదేశించారు. కాని స్థానిక అధికారులు గుట్టుచప్పుడు కాకుండా అర్హతలు లేని ఇంటి నిర్మాణాలకు బిల్లులు చెల్లించి అందినంతా దండుకున్నారు.

అదే ఇంటిని వ్యవసాయ పొలంలో నిర్మించుకున్న ఓ నాయకుడు

బినామీదంటూ ఏడాదిగా బిల్లులు

మంజూరు చేయని అధికారులు

తాజాగా గుట్టుచప్పుడు కాకుండా

చెల్లింపులు

అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు.. సమగ్ర విచారణ జరిపితే

మరెన్నో అక్రమాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement