నారాయణపేట: జిల్లాలోని పలుచోట్ల గురువారం వర్షం కురిసింది. జిల్లా సగటు వర్షపాతం 5.27 మి.మీ.గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా గుండుమాల్ మండలంలో 18.0 మి.మీ., దామరగిద్దలో 16.2, కొతపల్లిలో14.8, కోస్గిలో 6.4, మద్దూరులో 5.4, కృష్ణాలో 3.8, నారాయణపేటలో 2.6, ధన్వాడలో 1.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఊట్కూర్, మాగనూర్, మక్తల్, నర్వ, మరికల్‌ల్లో వర్షం కురవలేదు.
21న జిల్లాస్థాయి
అథ్లెటిక్స్ ఎంపికలు
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో ఈ నెల 21న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి రమణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–14, 16, 18, 20 బాలురు, బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు 21న ఉదయం 9 గంటల వరకు రిపోర్టు చేయాలని.. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారు ఈ నెల 26, 27 తేదీల్లో హన్మకొండలో జరిగే 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొననున్నట్లు వివరించారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్ 91007 53683 సంప్రదించాలని సూచించారు.
దత్తక్షేత్రంలో సినీనటుడు
శ్రీకాంత్ సందడి
మక్తల్: మండలంలోని పస్పుల వద్ద పవిత్ర కృష్టానది ఒడ్డున వెలసిన శ్రీదత్తక్షేత్రంలో ప్రము ఖ నటుడు హీరో శ్రీకాంత్ సందడి చేశారు. పవిత్ర శ్రావణ మాసం ప్రారంభం కావడంతో గురువారం ఆయన కుటంబ సభ్యులతో కలిసి దత్తక్షేత్రాన్ని దర్శించుకున్నారు. బోటులో ఆలయానికి చేరుకొని పూజలు జరిపించి మొక్కు లు చెల్లించుకున్నారు. సినీ నటుడు శ్రీకాంత్ పస్పులకు వచ్చారనే సమాచారంతో స్థానికులు, అభిమానులు అక్కడి చేరుకొని ఫొటో లు దిగేందుకు పోటీ పడ్డారు.
జాతీయ జెండా
ఎగురవేసేది వీరే..
● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం జరిగే జాతీయ పతాకాన్ని ఎగురవేసే వారి పేర్లను గురువారం ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేర కు ఉమ్మడి పాలమూరు పరిధిలోని మహ బూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో రాష్ట్ర ఎకై ్సజ్, పరా టక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నారాయణపేటలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖమంత్రి వాకిటి శ్రీహరి, నాగర్‌కర్నూల్‌లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, జోగుళాంబ గద్వాలలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, వనపర్తిలో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పట్నం మహేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అలాగే ప్రభు త్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు.
స్వాతంత్య్ర వేడుకల
పరేడ్ ప్రాక్టిస్
నారాయణపేట: జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఈ నెల 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో నిర్వహించే పోలీస్ పరేడ్ ప్రాక్టిస్‌ను గురువారం అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ ఉల్‌హక్ పరిశీలించారు. సిబ్బంది కవాతు, బ్యాండ్ సమన్వయం, ఏకరూపత తదితర అంశాలను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ సమన్వయం, క్రమశిక్షణతో పరేడ్ నిర్వహించాలని సూచించారు. ఆర్‌ఐ విజయభాస్కర్ పాల్గొన్నారు.
తగ్గిన వరద..
నిలిచిన విద్యుదుత్పత్తి
అచ్చంపేట/ఆత్మకూరు: ఎగువ నుంచి వస్తు న్న వరద తగ్గిపోవడంతో గురువారం జూరాల ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 101.356 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టారు. మరోవైపు శ్రీశైలం జలాశయంలో పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 879.30 అడుగులు నమోదైంది. జలాశయంలో 183.8486 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు మొత్తం నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు. ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేపట్టి 30,003 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,160 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు పదివేల క్యూసెక్కులు విడుదల చేశారు.


