న్యాయవాదుల విధుల బహిష్కరణ | - | Sakshi
Sakshi News home page

న్యాయవాదుల విధుల బహిష్కరణ

Aug 13 2026 1:03 AM | Updated on Aug 13 2026 1:03 AM

మక్తల్‌: నాగర్‌కర్నూల్‌లో సీనియర్‌ న్యాయవా ది ఎం.వేణుగోపాల్‌రావుపై దాడికి నిరసనగా బుధవారం మక్తల్‌ కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఎం.వేణుగోపాల్‌రావుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశా రు. కార్యక్రమంలో న్యాయవాదులు తిమ్మన్న, ఆడెం శ్రీనివాసులు, దత్తాత్రేయ, పసుల నీరజ్‌, రవికుమార్‌గౌడ్‌, వెంకటేష్‌గౌడ్‌, సురేందర్‌, శివకుమార్‌, సూర్యప్రకాష్‌, సతీష్‌కుమార్‌, ఆచారి, రంకుల ఆనంద్‌, రవికుమార్‌గౌడ్‌, సురేందర్‌, ఆనంద్‌ పాల్గొన్నారు.

కోయిల్‌సాగర్‌లో

16 అడుగుల నీటిమట్టం

మరికల్‌: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోస్తుండటంతో బుధవారం కోయి ల్‌సాగర్‌ ప్రాజెక్టులో 16 అడుగుల నీటిమట్టం ఉంది. జూరాలకు ఎగువ నుంచి మళ్లీ వరద కొనసాగడంతో కోయిల్‌సాగర్‌ నిండుతుందనే ఆశలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తీలేర్‌ పంపుహౌస్‌ నుంచి ఒక మోటార్‌ ద్వారా 15 రోజులుగా నీటిని తరలిస్తున్నారు. కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 32 అడుగులు కాగా.. ప్రస్తుతం సగం నిండింది. దీంతో ఆయకట్టు రైతుల్లో సాగుపై ఆశలు పెరుగుతున్నాయి.

గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకానికి ఇంటర్వ్యూలు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకానికి అధికారులు డెమో, ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం ఏడుగురు అభ్యర్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో వీసీ శ్రీనివాస్‌, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌ క్రాంతికిరణ్‌, సభ్యులు గోవర్ధన్‌రెడ్డి, నిరంజన్‌గౌడ్‌, ప్రిన్సిపాల్‌ చంద్రకిరణ్‌ పాల్గొన్నారు.

● పీయూ బాలుర హాస్టల్‌ను రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వసతులు, భోజనం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు. వార్డెన్లు కృష్ణయ్య, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

నేటినుంచి వాలీబాల్‌

అకాడమీ పునఃప్రారంభం

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: జిల్లా వాలీబాల్‌ అకాడమీని ఈనెల 13 నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు డీవైఎస్‌ఓ రాజశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అకాడమీలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులందరూ యథావిధిగా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. కోచ్‌లు, వార్డెన్‌తో పాటు సిబ్బంది అందరూ విధుల్లో చేరాలని సూచించారు.

సీతాఫల్‌ టెండర్లతో రూ.27.46 లక్షల ఆదాయం

మహబూబ్‌ననగర్‌ న్యూటౌన్‌: జిల్లాలో అటవీశాఖ పరిధిలోని మూడు యూనిట్లకు నిర్వహించిన సీతాఫల్‌ టెండర్లతో రూ.27.46 లక్షల ఆదాయం వచ్చింది. డీఎఫ్‌ఓ రేవంత్‌చంద్ర ఆధ్వర్యంలో బుధవారం జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయం ప్రాంగణంలో 2026–27 సంవత్సరానికి సంబంధించి బహిరంగ వేలంపాట నిర్వహించారు. మహబూబ్‌నగర్‌, నవాబ్‌పేట, మహమ్మదాబాద్‌ యూనిట్లకు అటవీ ప్రాంతంలో సీతాఫలాల సేకరణ హక్కులు కల్పించేందుకు టెండర్లు నిర్వహించారు.మహబూబ్‌నగర్‌ యూనిట్‌కు నిర్వహించిన వేలం పాటలో పది మంది పాల్గొనగా.. తాటి శ్రీనివాసులు రూ.14 లక్షలకు దక్కించుకున్నారు. నవాబుపేట యూనిట్‌ను మక్సూ ద్‌ అలీ రూ.5.41 లక్షలకు, మహమ్మదాబాద్‌ యూనిట్‌ను జి.కేశవులు రూ.8.05 లక్షలకు దక్కించుకున్నారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌ అటవీ రేంజ్‌ అధికారి రాజేందర్‌, మహమ్మదాబాద్‌ రేంజ్‌ అధికారి అబ్దుల్‌హాయ్‌, పరిపాలనాధికారి పద్మజ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement