పారదర్శక దర్యాప్తుతో శిక్షల శాతం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

పారదర్శక దర్యాప్తుతో శిక్షల శాతం పెంచాలి

Aug 13 2026 1:03 AM | Updated on Aug 13 2026 1:03 AM

నారాయణపేట: నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని డీఎస్పీ నల్లపు లింగయ్య పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో మక్తల్‌, కోస్గి సర్కిల్‌ పరిధిలోని పోలీసులతో నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న అండర్‌ ఇన్వెస్టిగేషన్‌,్‌ గ్రేవ్‌, నాన్‌గ్రేవ్‌ కేసుల దర్యాప్తు, పురోగతిని సీఐలు, ఎస్సైలను అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తులో అనుసరించాల్సిన విధానాలు, సేకరించాల్సిన ఆధారాలు, ప్రామాణిక విధానాలపై దిశా నిర్దేశం చేశారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని, ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో కేసులను ఛేదించాలని సూచించారు. శిక్షల శాతం పెంచేందుకు పటిష్టమైన సాక్ష్యాదారాలు సేకరించడం కీలకమన్నారు. అక్రమ ఇసుక రవాణా, గంజాయి, గుట్కా, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై దాడులు నిర్వహించి అరికట్టాలని సూచించారు. ప్రతి పోలీసు అధికారి స్టేషన్‌న్‌ నిర్వహణతో పాటు దర్యాప్తులో పూర్తిస్థాయి నైపుణ్యాలు కలిగి ఉండాలని తెలిపారు. కేసుల వివరాలను ప్రతిరోజూ ఆనన్‌లైన్‌లో నమోదు చేసి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలన్నారు. లాంగ్‌ పెండింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన ఛేదించాలని ఆదేశించారు. సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. ‘మన గ్రామం–మన పోలీసు’ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో పోలీసువాల్‌ వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. రాబోయే వినాయకచవితిని దృష్టిలో ఉంచుకొని ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో సీఐలు రాంలాల్‌, సైదులు, ఎస్సైలు అశోక్‌బాబు, రాజు, ఎస్‌ఎం నవీద్‌, రమేష్‌, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement